Railway Recruitment 2024:
రైల్వే శాఖకు సంబందించిన RITES లిమిటెడ్ నుండి 223 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ITI అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
రైల్వే శాఖ RITES డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన 223 పోస్టులకు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 6th డిసెంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ: 25th డిసెంబర్ 2024
ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
RITES లిమిటెడ్ నుండి 223 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ITI అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
TS లో 12,000+ రెవిన్యూ ఆఫీసర్ జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవడానికి అర్హులు. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
రైల్వే శాఖ RITES డిపార్ట్మెంట్ 223 అప్రెంటీస్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
AP అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల: Apply
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టిలను అనుసరించి ₹10,000/- ITI పోస్టులకు, ₹12,000/- డిప్లొమా పోస్టులకు, ₹14,000/- డిగ్రీ పోస్టులకు స్టైపెండ్ లేదా శాలరీస్ ఉంటాయి.ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు కావున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునేవారికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
10th, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
NCVT, SCVT సర్టిఫికెట్స్ ఉండాలి.
378 సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వే శాఖ RITES ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.