TTD SVIMS Notification 2026:
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి 303 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అధికారికంగా మూడు నోటిఫికేషన్స్ ని ప్రభుత్వం వారు విడుదల చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, పారామెడికల్ మరియు నాన్ పారామెడికల్ ఉద్యోగాలతో పాటు క్యాషియర్ , క్లర్క్, రిసెప్షనిస్ట్ వంటి పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు మూడు సంవత్సరాల వరకు అనుభవం కలిగి కంప్యూటర్ అప్లికేషన్స్ లో నాలెడ్జి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాల:
తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థకి సంబంధించిన SVIMS నుండి విడుదలైన ఉద్యోగాల యొక్క సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తిరుమల తిరుపతి దేవస్థానం- శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ |
| మొత్తం పోస్టులు | 303 |
| పోస్టుల వివరాలు | స్టాఫ్ నర్స్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోకం జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్, పారామెడికల్ మరియు నాన్ పారామెడికల్ పోస్టులు |
| అర్హతలు | ఏదైనా డిగ్రీ అర్హత, BSC nursing, GNM nursing, pharmacy |
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | జూలై 15, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Website Link |
పోస్టుల అర్హతలు:
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ నుండి విడుదలైన 303 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత లేదా బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎమ్ నర్సింగ్ లేదా ఫార్మసీ పూర్తి చేసి మూడు సంవత్సరాల వరకు సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు టీటీడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది
ఎగ్జామినేషన్ ఫీజు ఎంత?:
టీటీడీ స్విమ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఈ క్రింది ఫీజులను కేటగిరీల వారీగా ఆన్లైన్లో చెల్లించవలెను.
- OC, EWS అభ్యర్థులు : 2,360/-
- SC, ST, BC అభ్యర్థులు : ₹1770/-
సెలక్షన్ ప్రాసెస్ :
టీటీడీ స్విమ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సబ్మిట్ చేయాలి
- 75 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు
- మూడు సంవత్సరాల వరకు అనుభవం కలిగిన వారికి 15 మార్కుల వరకు వెయిటేజీ ఉంటుంది
- ఇంటర్వ్యూ కి 10 మార్కులు కేటాయిస్తారు.
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు మరియు లింక్స్:
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 15th జూలై, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆకరు తేదీ | 10th ఆగష్టు, 2026 |
| నోటిఫికేషన్ | Click Here |
| Apply Online Link | Click Here |
టీటీడీ స్విమ్స్ ఉద్యోగాల సమగ్ర సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శిస్తూ ఉండండి.