1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 7, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

IDBI Bank JAM Notification 2026:

IDBI బ్యాంకు నుండి దేశవ్యాప్తంగా 1300 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-O, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-A ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అన్ని రాష్ట్రాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

IDBI బ్యాంకు నుండి విడుదలైన మేనేజర్ పోస్టులకు సంబంధించిన సమాచారం చూడండి.

  • సంస్థ పేరు: IDBI Bank
  • మొత్తం పోస్టులు :1300
  • పోస్టుల వివరాలు : అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-A, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ – O
  • అర్హతలు: ఏదైనా డిగ్రీ అర్హత – 60 శాతం మార్కులు ఉండాలి
  • వయస్సు : 20 నుండి 30 సంవత్సరాలు
  • అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : మార్చి 8, 2026
  • అప్లికేషన్ లాస్ట్ డేట్: మార్చి 19, 2026

ఉద్యోగాల విద్యార్హతలు:

ఐడిబిఐ బ్యాంకు నుండి విడుదలైన 1300 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60 శాతం మార్కులతో డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ – O ఉద్యోగాలకు 20 నుండి 25 సంవత్సరాలు

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ -A ఉద్యోగాలకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులపై ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

ఈ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో తెలిపిన అప్లికేషన్ ఫీజులను చెల్లించవలెను. అనగా 500 నుండి 1000 రూపాయల వరకు ఫీజులు ఉంటాయి.

శాలరీ :

ఈ బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹40,000 నుండి ₹70 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

ఐడిబిఐ బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
  2. అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహిస్తారు
  3. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
  4. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
  5. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు

ఎలా అప్లై చేయాలి?:

ఐడిబిఐ బ్యాంకు నుండి విడుదలైన ఉద్యోగాలకు పైన తెలిపిన అర్హతలు కలిగిన వారు, ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై రింగ్స్ ద్వారా వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు మరియు లింక్స్:

అప్లికేషన్ ప్రారంభ తేదీ మార్చి 8 2026
అప్లికేషన్ ఆఖరి తేదీ మార్చి 19 2026
నోటిఫికేషన్ download
ఆన్లైన్ అప్లై లింక్ Click Here

బ్యాంకు ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని సందర్శించండి

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page