GATE 2026 Results Date & Branch Wise Cut Off Marks:
ఫిబ్రవరిలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2026) పరీక్షకి సంబంధించి ఫిబ్రవరి 22వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ గేట్ పరీక్షకి సంబంధించి దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారికి ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీలలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అభ్యర్థులు, ప్రాథమిక కీ చూసుకున్న తర్వాత బ్రాంచ్ల వారీగా ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతామో తెలుసుకోవాలని అటువంటి ఒక ఆసక్తి ఉన్నది. అలాగే ఫైనల్ ఏ తేదీన విడుదల చేస్తారు అని అభ్యర్థులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ఆర్టికల్ ద్వారా బ్రాంచ్ల వారీగా అర్హత మార్కులు, అలాగే ఫలితాలు విడుదలత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాము.
GATE 2026 Final Results Date:
గేట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ ని మార్చి 19, 2026 తేదీన IIT గౌహతి వారు అధికారికంగా విడుదల చేయనున్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి, అభ్యర్థి యొక్క స్కోర్ కార్డు మరియు రిజల్ట్ ని అలాగే వారి యొక్క ర్యాంక్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోని ఆ విధంగా అవకాశం కల్పిస్తున్నారు.
Branch Wise Qualifying /Cut Off Marks 2026:
గేట్ 2026 పరీక్షలకు సంబంధించి బ్రాంచుల వారీగా క్వాలిఫై / కట్ ఆఫ్ మార్కులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
| Paper Code | Test Paper | Expected Cut Off Marks |
| AE | Aerospace engineering | 27.4 – 30.4 |
| AG | agricultural engineering | 23.5 – 26.5 |
| AR | architecture and planning | 38.5 – 41.5 |
| BM | biometrical engineering | 27.7 – 30.7 |
| BT | biotechnology | 26.5 – 29.5 |
| CE | civil engineering | 27.7 – 30.7 |
| CH | chemical engineering | 26.2 – 29.2 |
| CY | chemistry | 23.5 – 26.5 |
| CS | computer science and information technology | 27.7 – 30.7 |
| DA | data science and artificial intelligence | 27.5 – 30.5 |
| EC | electronics and communication engineering | 23.5 – 26.5 |
| EE | electrical engineering | 23.5 – 26.5 |
| ES | environmental science and engineering | 24.5 – 27.5 |
| EY | Ecology and evolution | 38.0 – 41.0 |
| ME | mechanical engineering | 34.3 – 37.3 |
| MN | mining engineering | 29.1 – 32.1 |
| MT | metallurgical engineering | 38.5 – 41.5 |
How To Check GATE 2026 Results:
- ముందుగా IIT గౌహతి అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో “GATE 2026 Results Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- స్క్రీన్ పైన అభ్యర్థుల యొక్క స్కోర్ తో పాటు ఎంత ర్యాంకు వచ్చిందో చూపిస్తుంది.
- అది డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోండి.
గేట్ 2026 పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించండి.