TS ఇంటర్ 2026 జవాబు పత్రాల మూల్యాంకనం మార్చ్ 3 నుండి ప్రారంభం | TS Inter Results 2026 Date | TS Intermediate Results 2026

By: Sivakrishna Bandela

On: February 26, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Intermediate Results 2026:

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి మరియు రెండవ సంవత్సరం చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపుగా 9 లక్షల మందికి పైగా ఈ పరీక్షలు రాయనున్నారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మార్చి మూడవ తేదీ నుండి మూల్యాంకనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా సంస్కృతం పేపర్ తో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం త్వరగా పూర్తిచేసి, మార్చి చివరి నాటికి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు అన్ని విధాల కసరత్తులు ప్రారంభించారు. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ బోర్డు కన్వీనర్ కూడా అధికారిక ప్రకటన జారీ చేశారు. తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సంబంధించి తాజా సమాచారం ఈ ఆర్టికల్లో చూద్దాం.

తెలంగాణ ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభ తేద:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఈ పరీక్షల రాసిన విద్యార్థుల యొక్క జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి మూడవ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ముందుగా సంస్కృతం పేపర్ తో మూల్యాంకనం ప్రారంభించి, ఆ తర్వాత మూడు విడతల్లో మిగిలిన సబ్జెక్టుల పేపర్లను విద్య ప్రక్రియ కొనసాగుతుంది అని, ఇంటర్ బోర్డు కన్వీనర్ తెలిపారు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ?:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఈసారి గతంలో కంటే చాలా ముందుగానే అనగా, మార్చి 25వ తేదీ నుండి 31వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కన్వీనర్ మీడియాకు తెలిపారు. గతంలో ఏప్రిల్ నెలలో ఫలితాలు విడుదల చేసిన రికార్డులు ఉన్నాయి. ఈసారి అంతకంటే ముందుగానే ఫలితాలు విడుదల చేయడానికి అధికారులు పరీక్ష పత్రాల మూల్యాంకర్ అని మార్చి మూడవ తేదీ నుండి ప్రారంభించనున్నారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్:

  • తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుండి ప్రారంభమై మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఐదు నిమిషాలు ఆలస్మైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

  1. ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్ సైట్ పంపేజ్ లో ” Telangana intermediate 1st year and 2nd year 2026 hall tickets download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థి యొక్క రోల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ అవుట్ తీసుకోండి.

TGBIE Website Link

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన వెబ్సైట్ www.freejobsintelugu.com ని ప్రతిరోజు సందర్శించండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page