Postal GDS 2026 Results:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జనవరి, 2026 లో విడుదలైన పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 28,740+ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క ఫలితాలను ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల నుండి ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి అప్లికేషన్స్ స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు యొక్క మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలను, మరో మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు. అప్లై చేసుకున్న అభ్యర్థులు మెరిట్ లిస్టులో వారి యొక్క పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావలెను. పోస్టల్ జిడిఎస్ మెరిట్ లిస్ట్ ఫలితాలు యొక్క పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
Postal GDS 2026 Results Expected Dates:
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలను పరిశీలించండి.
| పోస్టల్ జిడిఎస్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | జనవరి 31, 2026 |
| పోస్టల్ జిడిఎస్ అప్లికేషన్ ఆఖరి తేదీ | ఫిబ్రవరి 16, 2026 |
| పోస్టల్ జిడిఎస్ 2026 1st మెరిట్ లిస్ట్ విడుదల తేదీ (Expected Date) | ఫిబ్రవరి 28, 2026 |
Note: పైన తెలిపిన ఫలితాలు విడుదల తేదీ కేవలం అంచనా తేదీ మాత్రమే. అయితే, పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఫలితాలను ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది.
Postal GDS 2026 Expected Cut Off Marks For AP & Telangana:
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 2026 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క ఫలితాలను వారికి పదో తరగతి లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి మెరిట్ లిస్టు విడుదల చేస్తారు. అయితే మన తెలుగు అభ్యర్థులు చాలామంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు అప్లై చేసుకున్నారు. ఈ రాష్ట్రాలకు సంబంధించిన పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నవారికి ఉద్యోగం రావాలి అంటే 10వ తరగతిలో ఈ క్రింది మార్కులు రావాలి.
| Postal Circle & Category | Expected Cut Off Marks (10th) |
| ఆంధ్రప్రదేశ్ (UR, EWS, OBC, SC, ST) | 100 కి 100 మార్కులు |
| తెలంగాణా (UR, EWS, OBC, SC, ST) | 100 కి 98.5+ మార్కులు |
| PWD అభ్యర్థులకు | 100 కి 87+ మార్కులు |
Note: పైన తెలిపిన అంచనా కట్ ఆఫ్ మార్కులు గత సంవత్సరాల రిజల్ట్స్ ద్వారా ఎంపికైన అభ్యర్థుల యొక్క కటాఫ్ మార్కులను ఆధారంగా చేసుకుని అంచనా వేయడం జరిగింది. రియల్ కట్ ఆఫ్ మార్కులు కూడా ఇలానే ఉంటాయి.
మొత్తం ఎన్ని మెరిట్ లిస్టులు విడుదల చేస్తారు:
పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలకు సంబంధించి ముందుగా మొదటి మెరిట్ లిస్టు విడుదల చేసిన తర్వాత, ఆ లిస్టులో ఉన్నవారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కానట్లయితే, వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తూ రెండవ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఇలాగా దాదాపుగా 5 నుండి 6 మెరిట్ లిస్టులను విడుదల చేసే అవకాశం ఉంటుంది.
How to download postal GDS 2026 results merit list:
పోస్టల్ జిడిఎస్ 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాష్ట్రంలో వారిగా వారి యొక్క మెరిట్ లిస్టులను క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా పోస్టల్ జిడిఎస్ అధికారిక వెబ్సైట్లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోం పేజీలో రాష్ట్రాలవారీగా మెరిట్ లిస్ట్ ఉంటుంది వాటి పైన క్లిక్ చేయండి.
- ఆ పోస్టల్ సర్కిల్ యొక్క మెరిట్ లిస్టు డౌన్లోడ్ అవుతుంది.
- ఆ లిస్టులో మీ రిజిస్ట్రేషన్ ఐడి ఉందో లేదో చెక్ చేసుకోండి.
- రిజిస్ట్రేషన్ ఐడి ఉన్నట్లయితే, మీరు ఆ ఉద్యోగానికి ఎంపికయ్యారని అర్థం.
- ఎంపికైన వారు లిస్టులో ఇచ్చిన తేదీలోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి.
పోస్టల్ జిడిఎస్ ఫలితాలకు సంబంధించిన సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.