AP SSC 2026 Hall Tickets OUT:
విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు అధికారికంగా మార్చి 2వ తేదీ సాయంత్రం విడుదల చేశారు. పరీక్ష రాయబోతున్న 9 లక్షల మంది విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి వారి యొక్క వివరాలతో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు. అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలని, తప్పులు ఉన్నట్లయితే బోర్డు అధికారులను లేదా స్కూల్ హెడ్మాస్టర్ ని సంప్రదించి ఆ తప్పులను సరిదిద్దుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పుడు హాల్ టికెట్లను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
How to download AP 10th 2026 hall tickets:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని అనుసరించండి.
- ముందుగా విద్యార్థులు ఏపీ పదవ తరగతి బోర్డు వెబ్సైట్ bse.ap.gov.in లోకి వెళ్లండి.
- హోం పేజీలో ” Ap SSC 2026 Regular Exams” ఆప్షన్ ని ఎంచుకోండి
- హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి,
- విద్యార్థి చదివిన జిల్లా, స్కూల్ పేరు ఎంపిక చేసి, విద్యార్థి పేరు సెలెక్ట్ చేసుకొని, మరియు డేట్ అఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని ” download hall ticket” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
- వెంటనే మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది
- హాల్ టికెట్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి.
- హాల్ టికెట్లు ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి.
- తప్పులు ఉన్నట్లయితే వెంటనే స్కూల్ హెడ్మాస్టర్ ని లేదా బోర్డు అధికారులను సంప్రదించి వాటిని సరి చేసుకోండి.
AP 10th Hall Tickets : Official Website
హాల్ టికెట్లు ఏమేమి వివరాలు ఉంటాయి?:
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి 2026 రెగ్యులర్ పరీక్షల యొక్క హాల్ టికెట్లు ఈ క్రింది వివరాలు ఉంటాయి. అవి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
- విద్యార్థి యొక్క పూర్తి పేరు
- విద్యార్థి యొక్క అధికారిక రోల్ నెంబర్
- విద్యార్థి డేట్ అఫ్ బర్త్
- విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- విద్యార్థి యొక్క సిగ్నేచర్
- సబ్జెక్టుల వారిగా పరీక్షల తేదీలు
- పరీక్షల సమయాలు
- పరీక్షల సెంటర్, పరీక్ష యొక్క కోడ్
- ఇతర ముఖ్యమైన వివరాలన్నీ చెక్ చేసుకోవాలి
Note: ఏపీ పదవ తరగతి 2026 రెగ్యులర్ పరీక్ష యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాని వారు, వెంటనే వారు చదువుకున్నటువంటి స్కూల్ హెడ్మాస్టర్ ని లేదా యాజమాన్యాన్ని సంప్రదించి, సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసుకొని హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలి.
ఏపీ పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.