Income Tax Dept. Notification 2024:
ఇన్కమ్ టాక్స్ అప్పేలెట్టే ట్రిబ్యునల్ నుండి గ్రూప్ బి స్థాయి ఉద్యోగాలు అయినటువంటి సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ 15 పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ 20 పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 120 WPM ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పెర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
అర్హతలు కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 5వ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ పూర్తి చేసి, దరఖాస్తు ఫారంతో పాటు ఇతర సర్టిఫికెట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ కలిపి ముంబయిలోని ఇన్కమ్ టాక్స్ అప్పేలెట్టే ట్రిబ్యునల్ కు పోస్ట్ ద్వారా పంపించవలెను.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆదాయపు పన్ను శాఖ నుండి అన్ని రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునే విధంగా సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ 15 పోస్టులు, ప్రైవేట్ సెక్రటరీ 20 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 120 wpm షార్ట్ హ్యాండ్ రైటింగ్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆఫ్ లైన్ విధానంలో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹70,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి గ్రూప్ బి స్థాయి ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల బెనిఫిట్స్, అలవెన్సెస్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
అప్లికేషన్ చేయదలిచిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
AP జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు : Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి
డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ / మార్క్స్ మెమో ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 200 Govt జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన అభ్యర్థులు అర్హతలు ఉన్నట్లయితే నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం పూర్తి చేసి గడువులోగా దరఖాస్తు చేయనుకోగలరు.
Notification & Application Form PDF
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.