TS Inter 1st & 2nd Year Results 2024 Release Date | TS Inter Results 2024 | TS Inter Results 2024 Release Date

Telangana Inter Results 2024:

తెలంగాణాలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం రాత పరీక్షలను తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు విజయవంతంగా ముగించింది. మొత్తం 1st ఇయర్, 2nd ఇయర్ కలిపి 9లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 1st ఇయర్ వాళ్ళు 4,78,527 మంది ఉన్నారు. అలాగే 4 లక్షల మందికి పైగా 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం మొత్తంగా 9,22,520 మంది పరీక్ష ఫీజు చెల్లించారు.

TS ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ఇలా చేస్తున్నారు:

ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తం గా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది ఆధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఒక్కో ఆధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు.

Join Our Telegram Group

ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

TS Inter Results Release Date:

ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈనెల 25వ తేదీలోగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా, టెక్నికల్ అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలిస్తోంది. మార్కులను ఆన్లైన్లో నమోదు చేయడం, OMR షీట్ కోడ్ డీ కోడ్ చేయడం వంటి పనులకు ఇంకొన్ని రోజులు టైమ్ పట్టనుంది. ఈ ప్రక్రియను 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 2, 3 రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీని ఖరారు చేస్తారని సమాచారం.

ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

950+ పోస్టులతో రోడ్ల శాఖలో ఉద్యోగాలు

Cognizant లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్

AP ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Official డేట్

హైకోర్టు జాబ్స్ నోటిఫికేషన్: 10th అర్హత

How To Check TS Inter Results 2024:

విద్యార్థులు వారి TS ఇంటర్ ఫలితాలు 2024 మొదటి సంవత్సరం మరియు TS ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు 2024 కు సంబందించిన ఫలితాల ప్రకటన తర్వాత Check చేయడానికి క్రింది వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు:

tsbie.cgg.gov.in

results.cgg.gov.in

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!