Railway Job Calendar 2026-27:
రైల్వేలో మరో లక్షకు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తూ రైల్వే డిపార్ట్మెంట్ అధికారికంగా 2026- 27 రైల్వే జాబ్ క్యాలెండర్ ని ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ కేలండర్ ద్వారా రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్, సెక్షన్ కంట్రోలర్ ,జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ క్యాటగిరీస్, రైల్వే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC), మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరి, గ్రూప్ డి లెవెల్ వన్ నోటిఫికేషన్లను 2026 27 సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు రైల్వే డిపార్ట్మెంట్ అధికారికంగా రైల్వే జాబ్ క్యాలెండర్ లో తెలిపింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రైల్వే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యొక్క పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు?:
రైల్వే జాబ్ కేలండర్ 2026-27 కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.
| నోటిఫికేషన్ పేరు | నోటిఫికేషన్ విడుదల తేదీ | అర్హతలు |
| రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ | ఫిబ్రవరి 2026 | 10th + ITI |
| రైల్వే టెక్నీషియన్స్ | మార్చ్ 2026 | 10th + ITI / Diploma |
| సెక్షన్ కంట్రోలర్ | ఏప్రిల్ 2026 | ఏదైనా డిగ్రీ |
| జూనియర్ ఇంజనీర్ | జూలై 2026 | డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ |
| పారామెడికల్ క్యాటగిరి | జూలై 2026 | ఫార్మసీ, నర్సింగ్ |
| నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (రైల్వే NTPC) | ఆగష్టు 2026 | 10+2 / ఏదైనా డిగ్రీ |
| మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరి | సెప్టెంబర్ 2026 | ఫార్మసీ, నర్సింగ్ |
| రైల్వే గ్రూప్-డి లెవెల్ – 1 | అక్టోబర్ 2026 | 10th Pass అర్హత |
ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు?:
రైల్వే జాబ్ కేలండర్ ద్వారా విడుదల చేయబోయేటువంటి ఉద్యోగాలకు భారతదేశంలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అంటే వారికి కనీసం పదవ తరగతి పాస్ అయిన అర్హత నుండి ఇంటర్మీడియట్ ,ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి?:
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు కల్పిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
- అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహిస్తారు.
- CBT 1, CBT 2 పరీక్షలు ఉంటాయి.
- కొన్ని ఉద్యోగాలకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?:
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కేటగిరీల వారీగా ఈ క్రింది విధంగా దరఖాస్తు ఫీజు ఉంటుంది.
- UR, EWS, OBC అభ్యర్థులకు : ₹500/-
- SC, ST, PWD అభ్యర్థులకు : ₹250/-
దరఖాస్తు చేసుకొని పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము తిరిగి చెల్లిస్తారు.
ముఖ్యమైన లింక్స్?:
రైల్వే విడుదల చేసిన రైల్వే 2026 జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ని క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
రైల్వే ఉద్యోగాల అప్డేటెడ్ సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని సందర్శించండి.