AP Inter 2026 Supplementary Exams Time Table:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పటినుండే ఎదురుచూస్తున్నటువంటి 2026 ఇంటర్ పరీక్షల యొక్క ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం 10:31 నిమిషాలకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయం నుండి రిజల్ట్స్ ని విడుదల చేశారు. ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాసినటువంటి చాలామంది విద్యార్థుల్లో ఎక్కువ మంది పాసయ్యారని, ఇది చాలా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. అయితే పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదని వారికి మే రెండవ వారంలో అడ్వాన్స్డ్ సప్లమెంటరీ రాత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సప్లిమెంటరీ పరీక్షల యొక్క టైం టేబుల్ ని విడుదల చేయడం జరిగింది.
AP Inter 2026 supplementary exams time table:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం సప్లమెంటరీ పరీక్షలు యొక్క తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సంవత్సరాల విద్యార్థులకు నిర్వహించనున్నారు. అయితే షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
- సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించే తేదీలు : ఈనెల 20 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు పేర్కొంది.
- సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే తేదీలు: థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు రెండు షిఫ్టుల్లో(9AM-12PM, 2.30PM-5.30PM) జరుగుతాయని తెలిపింది.
- ప్రాక్టికల్స్ జూన్ 7 నుంచి 11 వరకు నిర్వహిస్తామంది.
- సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేసే తేదీలు : మే నెల రెండవ వారంలో సప్లమెంటరీ పరీక్షల యొక్క హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు.
Note: సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ ప్రకారం విద్యార్థులు ఫీజులను ఆన్లైన్లో గాని లేదా కాలేజీ యాజమాన్యంలో చెల్లించి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి, అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావలెను.
Supplementary Exams 2026 FEE Details:
ఏపీ ఇంటర్మీడియట్ 2026 ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర సప్లమెంటరీ పరీక్షల యొక్క ఫీజు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- సప్లమెంటరీ పరీక్షల కొరకు ఒక సబ్జెక్టుకు చెల్లించాల్సిన ఫీజు: సబ్జక్ట్ కు ₹100/-
- రీకౌంటింగ్ కొరకు ఒక సబ్జెక్టుకు చెల్లించవలసిన ఫీజు: సబ్జెక్టు కు ₹100/-
- రీ వెరిఫికేషన్ కొరకు ఒక సబ్జెక్టుకు చెల్లించవలసిన ఫీజు : సబ్జెక్టుకు ₹800/- ఫీజు చెల్లించాలి.
ఏపీ ఇంటర్ 2026 ఫలితాలు చెక్ చేసుకున్నారా? లేదా?:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోండి.
- ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ లోనికి లాగిన్ అవ్వండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP Inter 2026 1st year and 2nd year results download ” ఆప్షన్ ని ఎంచుకోండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ కరెక్ట్ గా ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- డౌన్లోడ్ అయిన ఫలితాలను, సబ్జెక్టుల వారిగా మీకు వచ్చిన మార్కులను చెక్ చేసుకుని
- ఫలితాలు యొక్క షార్ట్ మార్క్స్ మెమోలను ప్రింట్ అవుట్ తీసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం షార్ట్ మార్క్స్ మెమో హార్డ్ కాపీని సేవ్ చేసుకోండి
AP Inter 2026 Results: Download Now
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 2026 సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ని విజిట్ చేయండి.