AP Inter 2026 1st Year & 2nd Year Results Date | AP Inter Results 2026 Date | How To Check Results Step Step Process

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter Results 2026 Date:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు యొక్క ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు పెద్ద శుభవార్త. ఫలితాలను రెండు రోజులు ముందుగానే విడుదల చేయడానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇంటర్మీడియట్ ఫలితాల ఫార్మేట్ ల పై స్పష్టతనిస్తూ అధికారికంగా ఒక ప్రకటన జారీ చేశారు. అఫీషియల్ గా విడుదల చేసిన ఈ ప్రకటన ఆధారంగా ఫలితాలను ఏప్రిల్ 15 లేదా 16వ తేదీల్లో విడుదల చేయడానికి అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయాల్సినటువంటి ఫలితాలను రెండు మూడు రోజులు ముందుగానే విడుదల చేయనున్నారు. ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించి కొత్తగా వచ్చిన తాజా సమాచారం గురించి ఇప్పుడు చూద్దాము.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల ఫార్మేట్ ల పై స్పష్టతనిస్తూ ప్రకటన జారీ:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాల ఫార్మాట్ ల పై స్పష్టతనిస్తూ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో ఉన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి:

  • ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలకు సంబంధించిన మార్కుల జాబితా( ఫలితాల ఫార్మేట్ ) రూపకల్పన విధానంపై వెబ్సైట్ హోస్టింగ్స్ కు సూచనలు జారీ చేశారు:
  • 1. ప్రథమ సంవత్సరం ( మొదటి సంవత్సరం) : ఈ ఏడాది మొదటి సంవత్సరం ఫలితాల ఫార్మాట్లో ఒక ముఖ్యమైన మార్పు చేయడమైనది.
  • 2. అదనపు సబ్జెక్టుల మార్కులను విద్యార్థి సాధించిన మొత్తం మార్కులతో కలపడం జరగదు.

* ఈ మార్కులను మార్కుల పట్టికలో కేవలం విడిగా మాత్రమే చూపించడం జరుగుతుంది*

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date
  • ద్వితీయ సంవత్సరం ( సాధారణ & వృత్తివిద్యా మరియు మొదటి సంవత్సరం వృత్తి విద్య ):

ద్వితీయ సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ విభాగాలను, మరియు మొదటి సంవత్సరం వృత్తి విద్య కు సంబంధించిన ఫలితాల Format లో ఎటువంటి మార్పులు లేవు. గత సంవత్సరం అనుసరించిన విధానం ఫార్మాట్) లోనే ఈ ఏడాది కూడా ఫలితాలు విడుదల అవుతాయి.

ఏపీ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు రెండు రోజులు ముందుగానే విడుదల:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 19వ తేదీ నాటికి కాకుండా ఏప్రిల్ 15 లేదా 16వ తేదీలలో ఒకేసారి రెండు సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు.

దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ మార్కుల ఫార్మాట్లో మార్పులు చేస్తూ నోటీస్ ని విడుదల చేయడం జరిగింది. మరో రెండు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి. పరీక్షలు రాసిన 10 లక్షల మందికి పైగా విద్యార్థులు అధికారిక వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released

ఏపీ ఇంటర్ 2026 పరీక్షల యొక్క ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 పరీక్షల ఫలితాలను ఈ క్రింది ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోండి.

  1. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్ సైట్ హోమ్ పేజీలో ” AP Inter 2026 Results” ఆప్షన్ పై క్లిక్ చేసి మొదటి లేదా రెండో సంవత్సరాన్ని ఎంపిక చేసుకోండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. సబ్జెక్టుల వారిగా మీకు వచ్చిన మార్కులను చెక్ చేసుకొని, మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP Inter Results 2026 Website

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలు మరో రెండు రోజుల విడుదలకానున్న నేపథ్యంలో ఫలితాలు యొక్క అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శిస్తూ ఉండండి.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page