పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ : ఫలితాలు విడుదల తేదీ ఫిక్స్

By: Sivakrishna Bandela

On: March 30, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

10th Class Results 2026:

పదవ తరగతి పరీక్షల యొక్క స్పాట్ వాల్యుయేషన్, అలాగే ఫలితాల విడుదల తేదీ షెడ్యూల్ ఖరారు చేశారు. త్వరగా పేపర్స్ కరెక్షన్ పూర్తిచేసి, ఫలితాలను విడుదల చేసేందుకు ఏపీ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్ రెండో తేదీతో పదో తరగతి రెగ్యులర్ పరీక్షలు పూర్తికానున్నాయి. ఫలితాలను త్వరగా విడుదల చేస్తే విద్యార్థులకు ఎంతో మేలు చేపడుతుందని, వారు ఇంటర్మీడియట్ మరియు ఇతర హయ్యర్ ఎడ్యుకేషన్ లో జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుందని భావించిన అధికారులు పేపర్ వేల్యూషన్ మరియు ఫలితాలు విడుదల కి సంబంధించి ఒక అంచనాకి వచ్చారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈ విధంగా ఖరారు చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 16వ తేదీన ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ రెండో తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు పూర్తయిన వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని అధికారులు భావించారు. ఎందుకుగాను ఏప్రిల్ నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు పరీక్ష పత్రాల మూల్యాంకనం జరపాలని ప్రభుత్వం భావించి దీనికి సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేశారు. మూల్యాంకనంలో పాటించాల్సిన నిబంధన పై తాజాగా డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి మార్గదర్శకాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లా కేంద్రాలలో పది రోజులపాటు మూల్యాంకనం జరుగుతుంది.

ఏపీ, తెలంగాణలో ఇంటర్ ఫలితాల డేట్స్ వచ్చేశాయి | AP Inter Results 2026 | TS Inter Results 2026

ఒక్కొక్క అసిస్టెంట్ ఎగ్జామినర్ కు 40 జవాబు పత్రాలను రోజుకి అందిస్తారు. ఇందులో ఆ ఎగ్జామినర్ కు ఉదయం పూట 20 పత్రాలు, మధ్యాహ్నం పూట మరొక 20 జవాబు పత్రాలు అందిస్తారు.

ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదల:

కాగా, పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన వెంటనే మార్కులను మాన్యువల్ గా, మరియు ట్యాబుల్లోను ఎంటర్ చేసి నమోదు చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ విధానం ఇంటర్ తో పాటు పదవ తరగతి పరీక్ష పత్రాలు వాల్యుయేషన్ లో కూడా అమలు కానుంది. మార్కుల లెక్కింపులో ఎటువంటి పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ సంవత్సరం టాబులను తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు మార్కులను ట్యాబ్ లలో నమోదు చేసి పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వాన్ని పాటించాలని సూచించింది.

RRB గ్రూప్ D 2026 ఫలితాలు విడుదల తేదీ | జోన్ల వారీగా మెరిట్ జాబితా PDF – స్కోర్ కార్డు లింక్ | RRB Group D 2026 results date

ఏప్రిల్ 14వ తేదీ నుండి పది రోజులపాటు నమోదు ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. గతేడా అది ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25వ తేదీ మధ్యన ఫలితాలను విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీ పదవ తరగతి ఫలితాలు 2026 అంచనా విడుదల తేదీ | AP 10th Class 2026 Results Prediction

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page