ఏపీ, తెలంగాణలో ఇంటర్ ఫలితాల డేట్స్ వచ్చేశాయి | AP Inter Results 2026 | TS Inter Results 2026

By: Sivakrishna Bandela

On: March 27, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP, TS Inter Results 2026 Dates:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇటీవల ఇంటర్మీడియట్ రాత పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు ఫలితాలు విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ప్రస్తుతం ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో నిమగ్నమై ఉన్నారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా, గతంలో మాదిరిగా ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయడం వల్ల ఇతర పోటీ పరీక్షల విషయంలో ఆలస్యం అవుతున్నందున ఈసారి ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. అయితే ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫలితాల విడుదలకి సంబంధించిన తేదీలను ఖరారు చేశారు.

AP, TS ఇంటర్ 2026 ఫలితాలు ఎప్పుడంటే?:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు యొక్క ఫలితాలు ఈ క్రింది తేదీలలో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  • తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఈసారి గతంలో కంటే ముందుగానే విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 12వ తేదీ నాటికి ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
  • ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 21వ తేదీ లోగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
  • రెండు రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి తప్పులు లేకుండా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేయమన్నారు.

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదలైన తర్వాత, రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెల మొదటి వారం లేదా రెండవ వారంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల నుండి సప్లమెంటరీ పరీక్షల యొక్క సబ్జెక్టులకు సంబంధించిన ఫీజులను సేకరించి, ఆ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న వారికి ఎంసెట్ మరియు ఇతర అడ్మిషన్స్ కి సంబంధించిన పోటీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. తద్వారా విద్యార్థులు టెక్నికల్ మరియు డిగ్రీ కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page