RRB గ్రూప్ D 2026 ఫలితాలు విడుదల తేదీ | జోన్ల వారీగా మెరిట్ జాబితా PDF – స్కోర్ కార్డు లింక్ | RRB Group D 2026 results date

By: Sivakrishna Bandela

On: March 26, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

RRB Group D 2026 Results Date:

నవంబర్ 27 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మూడు షిఫ్ట్లలో రైల్వే గ్రూప్ డి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 10,822,423 మంది అభ్యర్థులు గ్రూప్ డి ఫలితాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అభ్యర్థుల కోసం అధికారిక వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్ తో పాటు ఆన్సర్ కి ని అప్లోడ్ చేసింది. ఇప్పుడు రైల్వే గ్రూప్-డి లెవెల్ 1 2026 ఫైనల్ రిజల్ట్స్, స్కోర్ కార్డు మరియు కట్ ఆఫ్ మార్కులతో కూడిన ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీ లోగా విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రైల్వే గ్రూప్ డి 2026 ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం కిందకి స్క్రోల్ చేయండి.

RRB group D 2026 results date:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తమ అధికారిక వెబ్సైట్ rrbcdg.gov.in లో 2026 ఏప్రిల్ 10వ తేదీలోగా గ్రూప్ డి ఫైనల్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫలితాలతో పాటు అధికారులు మెరిట్ జాబితా పిడిఎఫ్, జోన్లవారీగా కట్ ఆఫ్ మార్కులను కూడా పిడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ చేయడం ద్వారా ఆర్ఆర్బీ గ్రూప్ డి స్కోర్ కార్డు 2026 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెరిట్ జాబితా పిడిఎఫ్ లో రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్న అభ్యర్థులను గ్రూప్ డి లెవెల్ వన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కు పిలుస్తారు.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  • ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్సర్ కీ పై అభ్యంతరం తెలియజేయడానికి ఫిబ్రవరి 23వ తేదీ వరకు సమయం ఇచ్చిన విషయం తెలిసిందే.
  • ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్సర్ కీ ని అభ్యర్థులందరికీ కోసం అధికారిక వెబ్సైట్ rrb.digialm.com వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది.

How to check RRB group D 2026 final result:

చాలామంది అభ్యర్థులు రైల్వే గ్రూప్ డి 2026 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్ రిజల్ట్స్ విడుదలైన తర్వాత మీ యొక్క ఫలితాలను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవచ్చు.

  1. ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో గానీ లేదా సంబంధిత ప్రాంతీయ ఆర్ఆర్బీ రీజినల్ వెబ్సైట్లో ఫలితాలు ఉంటాయి కావున అది ఓపెన్ చేయాలి.
  2. హోం పేజీలో ” RRB group D CEN 08/2024 stage 1 Results” లింకుపై క్లిక్ చేయండి
  3. స్క్రీన్ పైన కనిపించే పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి
  4. రిజిస్ట్రేషన్ నంబర్ ని ఆ పిడిఎఫ్ లో సెర్చ్ చేసి మీరు స్టేజ్ వన్ కి ఎంపికయ్యారో లేదో చెక్ చేసుకోండి.
  5. అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీతో లాగిన్ అయ్యి మీ యొక్క స్కోర్ కార్డును చెక్ చేసుకోండి.
  6. భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్స్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి

రైల్వే గ్రూప్ డి స్కోర్ కార్డు 2026 లో ఉండే వివరాలు:

అభ్యర్థులు స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రైల్వే గ్రూప్-డి కోర్కార్డులో ఈ క్రింది వివరాలు పేర్కొనబడతాయి.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key
  • అభ్యర్థి పేరు.
  • రిజిస్ట్రేషన్ నెంబర్
  • పుట్టిన తేదీ
  • Gender
  • రోల్ నెంబర్
  • తల్లి లేదా తండ్రి పేరు
  • కేటగిరి పేరు
  • మొత్తం పరీక్ష మార్కులు
  • అభ్యర్థి సాధించిన మొత్తం మార్కులు
  • మొత్తం కట్ ఆఫ్ స్కోరు
  • ఆర్ఆర్బి రీజియన్ పేరు

త్వరలో రైల్వే గ్రూప్ డి ఫైనల్ ఫలితాలు విడుదల కానున్నాయి కావున అభ్యర్థులు ప్రతిరోజు అధికారిక వెబ్సైట్ని సందర్శిస్తూ ఫలితాల కోసం చెక్ చేయండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page