Postal GDS 2026 Results:
భారతదేశంలో ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో పని చేయడానికి 28,740 పోస్టులతో పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం జనవరి 2026 లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల యొక్క మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలను ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రంలోగా విడుదల చేయనున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు జనవరి 31వ తేదీ నుండి వారి 16వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 సర్కిల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు కొన్ని లక్షల మంది పదో తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తులు చేస్తున్నటువంటి అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. కంప్యూటర్ ఆధారిత జనరేటర్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ముందుగా మొదటి మెరిట్ లిస్ట్ ను అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు.
Postal GDS 2026 1st Merit List Results Release Date:
పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు పోస్టల్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలను ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రంలోగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు తాము అప్లై చేసుకున్న సర్కిల్ స్టేట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకునే విధంగా మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ ని అప్లోడ్ చేయమన్నారు. అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్ లోనే ఫలితాలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
How To Download Postal GDS Merit List 2026:
పోస్టల్ జిడిఎస్ 2026 మెరిట్ లిస్టు ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా పోస్టల్ జిడిఎస్ ఆన్లైన్ వెబ్సైట్లోనికి వెళ్ళండి.
- వెబ్సైట్ హోం పేజీలో “Postal GDS 2026 Schedule-1 Results Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అభ్యర్థులు అప్లై చేసుకున్న పోస్టల్ సర్కిల్ స్టేట్ ను ఎంపిక చేసుకోండి.
- వెంటనే మొదటి మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
- ఆ లిస్టులో మీ పేరు లేదా రిజిస్ట్రేషన్ ఐడి ఉందా లేదా చెక్ చేసుకోండి
- పేరు ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైనట్లు అర్థం
- ఎంపికైన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావలెను.
Postal GDS 2026 Schedule-1 Results : Click Here
FAQ’s:
1. మొదటి మెరిట్ లిస్టులో పేరు లేని వారు ఉద్యోగానికి ఇంకా ఎంపిక కారు అని అర్థమా?
No. మొదటి మెరిట్ లిస్టులో పేరు లేని అభ్యర్థులు రెండవ మెరిట్ లిస్ట్ లేదా మూడో మెరిట్ లిస్టులో లేదా తదుపరి విడుదలయ్యే మెరిట్ లిస్టులలో పేరు ఉండే అవకాశం ఉంటుంది.
2. పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలను ఏ తేదీన విడుదల చేయనున్నారు?
ఫిబ్రవరి 28, 2026 తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.
3. మొత్తం ఎన్ని పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు విడుదల చేశారు?
28,740+ పోస్టులను విడుదల చేయడం జరిగింది.