AP EAMCET 2025 Counselling Dates, Registration Dates, Certificates List, Classes Start Date

By: Sivakrishna Bandela

On: July 4, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025 Counselling Schedule:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఈరోజు ఏపీ ఎంసెట్ కన్వీనర్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ని అధికారికంగా విడుదల చేశారు. జూలై 7వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని విద్యార్థులు ఫీజు చెల్లించాలి. తర్వాత విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై అన్ని ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలను సబ్మిట్ చేసి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ లో కాలేజీలను ఎంపిక చేసుకున్న విద్యార్థులకు, సీట్ అలాట్మెంట్ చేసి సంబంధిత కాలేజీలలో అడ్మిషన్స్ ఇస్తారు. మొదటి విడత కౌన్సిలింగ్లో ఎంపికైన విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీ నుండి తరగతుల ప్రారంభం కానున్నాయి. ఈరోజు విడుదలైన ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూసి తెలుసుకుందాం.

AP EAMCET 2025 counselling dates:

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join WhatsApp group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

ఏపీ ఎంసెట్ 2025లో 10,000 నుండి 1,60,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది.

కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల తేదీ 4th July, 2025
పత్రికా ప్రకటన విడుదల తేదీ 5th July, 2025
రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లించే తేదీలు 7th July, 2025 – 16th July, 2025
అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు (HLC’s వద్ద )7th July నుండి 17th జూలై వరకు
వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసే తేదీలు 10th July నుండి 18th July వరకు
వెబ్ ఆప్షన్స్ మార్చుకునే తేదీ 19th July, 2025
సీట్ అలాట్మెంట్ చేసే తేదీ 22nd July, 2025
సీటు పొందిన కాలేజీలలో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చే తేదీ 23rd July, 2025
మొదటి సంవత్సర తరగతుల ప్రారంభమయ్యే తేదీ 4th August, 2025

Note: పైన తెలిపిన షెడ్యూల్ అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు ఆ షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కు హాజరుకాగలరు.

ఏపీ ఎంసెట్ 2025 లో ఎంత ర్యాంకు వస్తే RVR & JC కాలేజీలో సీటు వస్తుంది.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కు కావలసిన సర్టిఫికెట్స్:

కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది సర్టిఫికెట్లను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒరిజినల్ మరియు జిరాక్స్ పత్రాలను రెడీ చేసుకోవాలి.

  1. రిజిస్ట్రేషన్ సమయంలో ఆన్లైన్లో చెల్లించిన ఫీజు రిసిప్ట్ ఉండాలి
  2. ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్
  3. ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డు
  4. 10వ తరగతి మార్క్స్ మెమో
  5. 10+2/ ఇంటర్ మార్క్స్ మెమో
  6. ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)
  7. కుల ధ్రువీకరణ పత్రాలు (SC, ST, BC, EWS)
  8. ఇన్కమ్ సర్టిఫికెట్
  9. PWD సదరం సర్టిఫికెట్
  10. ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉండాలి.

సర్టిఫికెట్ల పరిశీలన ఎక్కడ చేస్తారు?:

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ సమయంలో సంబంధిత గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించిన విద్యార్థులు, మీ దగ్గరలోని helpline centres లో (HLC’s) సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి. విద్యార్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ పత్రాలను సమర్పించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page