NITTTR Notification 2024:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ డిపార్ట్మెంట్ నుండి 22 జూనియర్ సచివాలయం అసిస్టెంట్, సీనియర్ సచివాలయం అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు ఇలా ఉన్నాయి:
మొత్తం 22 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ సచివాలయం అసిస్టెంట్, సీనియర్ సచివాలయం అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను NITTTR డిపార్ట్మెంట్ నుండి అధికారికంగా విడుదల చేశారు. పోస్టులను అనుసరించి 10th, ఇంటర్ డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
AP ప్లానింగ్ Dept లో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
పోస్టులను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సదలింపు ఉంటుంది.
శాలరీ ఎంత ఉంటుంది?:
NITTTR నుండి విడుదలయినఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని అలవెన్స్ లు కలుపుకొని పోస్టులను బట్టి ₹30,000/- నుండి ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. TA, DA, HRA అన్ని బెనిఫిట్స్ ఉంటాయి.
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగాలు: 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ కేంద్రంగా రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. అర్హత పొంది, మంచి మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు..
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో SC, ST, PWD వారు ₹300/- ఫీజు చెల్లించాలి, మిగిలిన అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి.
రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
దరఖాస్తు తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 14th సెప్టెంబర్ 2024
దరఖాస్తు ఆఖరు తేదీ : 15th అక్టోబర్ 2024
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి, వేరే విధానంలో దరఖాస్తు చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అంగీకరించబడవు. నోటిఫికేషన్ PDF, అప్లై ఆన్లైన్ లింక్స్ ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని apply చేసుకోగలరు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించిన సమాచారం కోసం ఈ వెబ్సైటుని సందర్శించండి.