TS 10th 2026 Results Date:
తెలంగాణ 10వ తరగతి 2026 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మే 4 లేదా 5వ తేదీల్లో ఫలితాలు విడుదల చేయడానికి తెలంగాణ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసిన అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఏప్రిల్ 23వ తేదీ నాటికి చావా పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి, మార్కుల నమోదు ప్రక్రియ కూడా అదే తేదీ నాటికి పూర్తి చేసే విధంగా బోర్డు అధికారులు పనిచేస్తున్నారు. దాదాపుగా ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బోర్డు పదవ తరగతి పరీక్షలను రాశారు. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా పదో తరగతి పరీక్షల యొక్క ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ పదవ తరగతి 2026 పరీక్షలు విడుదల తేది:
తెలంగాణ హోండా సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి 2026 ఫలితాలను మే 4 లేదా 5వ తేదీ లో విడుదల చేయనున్నట్లు ఇప్పుడే సమాచారం వచ్చింది. ఏప్రిల్ 23వ తేదీ నాటికి పరీక్ష పత్రాల మూల్యాంకనం మార్కుల నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత మార్కులను మళ్లీ వెరిఫై చేసి ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేస్తారు. వీటన్నిటినీ పూర్తి చేసిన అధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి లేదా వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఫలితాలను తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్మీడియట్ ఫలితాల్లో 74 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మే 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.
తెలంగాణ పదవ తరగతి ఫలితాలను విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు యొక్క అధికారిక సమాచారం కోసం ఈ వెబ్సైట్ ని తరచుగా విజిట్ చేస్తూ ఉండండి. మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసిన తర్వాత, మే చివరి వారంలో గాని లేదా జూన్ మొదటి వారంలో పదవ తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు షెడ్యూల్ విడుదల చేస్తారు.
ఫెయిల్ అయిన విద్యార్థులు వారు సబ్జెక్టుల వారీగా ఫీజులను చెల్లించేందుకు కొద్దిరోజులు సప్లిమెంటరీ ఫీజు డేట్స్ కూడా విడుదల చేస్తారు.
ఇప్పటికే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర అడ్మిషన్స్ ప్రారంభమైన నేపథ్యంలో, ఫలితాలను త్వరగా విడుదల చేసి విద్యార్థులు ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యేవిధంగా అవకాశం కల్పించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.