AP 10th Results 2026 Release Date | AP SSC 2026 Results Release Date

By: Sivakrishna Bandela

On: April 17, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 10th Class Results 2026 Release Date:

ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు పై ఉత్కంఠ నెలకొని ఉంది. ఏప్రిల్ రెండో తేదీ తో పరీక్ష ముగించిన ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఏప్రిల్ ఆరో తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 3415 సెంటర్లలో ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలను నిర్వహించారు. దాదాపుగా 6.4 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు విడుదల చేసిన ఇంటర్ బోర్డు అధికారులు, ఇప్పుడు రెండు రాష్ట్రాల పదో తరగతి బోర్డు అధికారులు టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాల విడుదలపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. మూల్యాంతనం చేసిన జవాబు పత్రాలు యొక్క మార్కులను మ్యాన్యువల్ గా అలాగే ట్యాబ్ లను ఉపయోగించి మార్కుల నమోదు ప్రక్రియ చేయాలని పదో తరగతి బోర్డు అధికారులు ఆదేశించారు. మొదట ట్యాబ్ లలో మార్కుల నమోదు ప్రక్రియ చేస్తున్న సమయంలో సాంకేతిక సమస్య కారణంగా కొంత ఆలస్యం జరిగితే, తర్వాత ఆ సమస్యను అధికారులు పరిష్కరించడంతో మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా ముగించారు. ఇప్పుడు ఆ పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చివరి పనులను పూర్తిచేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.

AP 10th Results 2026 Date | AP SSC Results 2026 Date | AP 10th Class 2026 Results Date – Chcek Details

విద్యార్థులు ఈసారి పరీక్షల యొక్క ఫలితాలను ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ తో పాటు వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ నంబర్ ద్వారా గా కూడా ఫలితాలను తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులు ఇంటర్ బోర్డు వారికి ఎస్ఎంఎస్ చేసి, ఎస్ఎంఎస్ ద్వారాగా కూడా విద్యార్థుల యొక్క పదవ తరగతి ఫలితాలు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏప్రిల్ 13వ తేదీతో 10వ తరగతి పరీక్షలు ముగిసాయి. దీంతో ఆ బోర్డు అధికారులు మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షలు యొక్క మూల్యాంకన ప్రక్రియ త్వరగా పూర్తిచేసి ఆ రాష్ట్ర టెన్త్ క్లాస్ ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు పసరత్తు ప్రారంభించారు తెలంగాణ బోర్డు అధికారులు.

AP Inter Results 2026 Toppers List | AP Intermediate 2026 Results Toppers List

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 15వ తేదీన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఏపీ పదవ తరగతి బోర్డు ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాలను https://bseap.in/ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

CBSE 10th Results 2026 Likely Today | Check CBSE Class 10 Result @results.cbse.nic.in

ఫలితాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page