AP 10th Class 2026 Results Date:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షను మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ రెండో తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు, నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన సబ్జెక్టుల మూల్యాంకన ప్రక్రియ కూడా త్వరగా పూర్తిచేసి ఏప్రిల్ నెలాఖరు నాటికీ ఫలితాలు విడుదల చేయాలనీ ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తున్నారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి సబ్జెక్టుల వారీగా మార్కుల నమోదు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఏపీ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల తేదీ:
ఏపీ 10వ తరగతి 2026 ఫలితాలను ఏప్రిల్ చివరి వారం నాటికి అనగా ఏప్రిల్ 30వ తేదీ నాటికి విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే సగం వరకు పని పూర్తి చేశారు. మిగిలినటువంటి పని కూడా మరికొద్ది రోజుల్లో పూర్తిచేసి, ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 30వ తేదీ నాటికి విడుదల చేసేందుకు సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల వారి యొక్క ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి, వాట్సాప్ మన మిత్రమా సర్వీసెస్ నుండి, మరియు ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు.
ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకా పదవ తరగతి పరీక్షల ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
How to check AP 10th class 2026 results:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఈ క్రింది ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా ఏపీ పదవ తరగతి బోర్డ్ అధికారిక వెబ్సైట్లోనికి వెళ్ళండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో “AP 10th Class 2026 Results” డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- మీకు వచ్చిన మార్కులను చెక్ చేసుకొని మార్క్స్ మెమోని ప్రింట్ అవుట్.
FAQ’s :
1. ఏపీ 10వ తరగతి 2026 పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించారు?
మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు
2. ఏపీ పదవ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాలు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది?
ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ నాటికి విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు
పదో తరగతి ఫలితాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి.