AP Inter Results 2026 Recounting & Reverification Dates | AP Inter Results 2026 Recounting Dates | AP Inter Results 2026 Reverification Dates

By: Sivakrishna Bandela

On: April 15, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter Results 2026 Recounting & Reverification Dates:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలు అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయిన వారు అలాగే కొన్ని సబ్జెక్టులలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఫ్రీ వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ కు ఛాలెంజ్ చేసుకోవడానికి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు సబ్జెక్టుల వారీగా రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కి ఫీజులు చెల్లించేందుకుగాను తేదీలను ప్రకటించడం జరిగింది. విద్యార్థులు ఆ తేదీలలోగా ఆన్లైన్లో గాని లేదా కాలేజ్ యాజమాన్యం ద్వారా రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కి అప్లై చేసుకుని ఫీజులు చెల్లించవలెను.

Recounting & Reverification Dates:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు మరియు ఫీజుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Telangana 10th Class 2026 Results Date | TS 10th 2026 Results Date – How To Check Step By Step Process
  • రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్కు అప్లై చేసుకునే తేదీలు : రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఈనెల 20 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
  • రీకౌంటింగ్ కొరకు ఒక సబ్జెక్టుకు చెల్లించవలసిన ఫీజు : ₹100/-
  • రీ వెరిఫికేషన్ కొరకు ఒక సబ్జెక్టుకు చెల్లించవలసిన ఫీజు : ₹800/-
  • సబ్జెక్టుల వారీగా ఫీజును ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకొని చెల్లించవలెను. లేదా కాలేజీ యాజమాన్యం ద్వారా కూడా ఫీజులు చెల్లించవచ్చు.
  • Recounting & Reverification Apply Website: Click Here

రీకౌంటింగ్ & రీ వెరిఫికేషన్ లో ఏది బెటర్?:

ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చిన వారు అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు చాలామంది రీకౌంటింగ్ & రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండిటిలో ఏది ఎంపిక చేసుకుంటే విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

Recounting అంటే ఏంటి?:

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT
  • మీ సబ్జెక్టు యొక్క ఆన్సర్ షీట్ లో వచ్చిన మార్కులను మళ్లీ లెక్కించడం మాత్రమే.
  • ఎక్కడైనా టోటల్ మార్క్స్ తప్పుగా వేశారా లేదా అనేది చెక్ చేస్తారు అంతే.
  • మీరు రాసిన ఆన్సర్ ని మళ్లీ ఇవాల్యూయేషన్ చేయరు.

Reverification అంటే ఏంటి?:

  • రీ వెరిఫికేషన్ అంటే, మీ ఆన్సర్ షీట్ ని మళ్లీ చెక్ చేయడం.
  • evaluation లో ఏమైనా తప్పులు జరిగాయా లేదా అనేది మళ్లీ పరిశీలిస్తారు.
  • కానీ ఆన్సర్ కి మళ్లీ కొత్తగా మార్క్స్ ఇవ్వడం కాదు.
  • మీరు ఆన్సర్ బాగానే రాశారు కానీ మీకు తక్కువ మార్కులు వచ్చాయి అని మీరు భావిస్తే రీ వెరిఫికేషన్ కి వెళ్ళవచ్చు.

✅ ఈ రెండింటిలో ఏది బెటర్?:

AP 10th Results 2026 Release Date | AP SSC 2026 Results Release Date
  • సాధారణంగా బెస్ట్ ఆప్షన్: రీ వెరిఫికేషన్.
  • ఎందుకంటే రీకౌంటింగ్ లో కేవలం మీకు వచ్చిన మార్పుల్ని మళ్ళీ లెక్కిస్తారు అంతే.
  • రీ వెరిఫికేషన్ లో అయితే, ఆన్సర్ షీట్ మొత్తం మళ్లీ చెక్ చేసి, మార్కులు ఇవ్వని సమాధానాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేస్తారు.
  • దీనివల్ల రీ వెరిఫికేషన్ లో మీకు మార్కులు కలిసి పెరిగే అవకాశం ఉంటుంది.

కాబట్టి విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చిన, లేదా ఏదైనా సబ్జెక్టులలో ఫెయిల్ అయిన రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు ఏది ఎంపిక చేసుకుంటే మీకు మేలు జరుగుతుందో ఆలోచించి వాటికి ఫీజులు చెల్లించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page