AP Inter 2026 Supplementary Exams Dates | AP Inter 2026 Results Date | AP Intermediate 2026 Supplementary Exams Time Table

By: Sivakrishna Bandela

On: April 14, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter 2026 Supplementary Exams:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10:31 నిముషాలకు విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులకు మరియు మార్కులు పెంచుకోవాలి అనుకునే విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు యొక్క షెడ్యూల్ ని కూడా అనధికారికంగా ప్రకటించారు. ఏపీ ఇంటర్మీడియట్ 2026 సప్లిమెంటరీ పరీక్షలను మే 12 నుండి 20వ తేదీ మధ్య నిర్వహించడానికి సముకత వ్యక్తం చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజులను స్వీకరించి ఆ తర్వాత మే 12వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

ఏపీ ఇంటర్ 2026 పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?:

ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు మీడియాకు తెలిపిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10:31 నిముషాలకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ మొదటి మరియు రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో గాని, వాట్సాప్ మన మిత్రమా సర్వీసెస్ ద్వారా గాని, లేదా ఎస్ఎంఎస్ ద్వారా విద్యార్థులు వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

Telangana 10th Class 2026 Results Date | TS 10th 2026 Results Date – How To Check Step By Step Process

ఏపీ ఇంటర్ 2026 సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదేనా?:

ఏపీ ఇంటర్మీడియట్ 2026 సప్లిమెంటరీ పరీక్షలను మే 12 నుండి 20వ తేదీ వరకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసి ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఫీజులను స్వీకరించి, ఫీజు చెల్లించిన విద్యార్థులకు హాల్ టికెట్లను విడుదల చేసి మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.

ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియ మరియు మార్కుల నమోదు ప్రక్రియ కూడా పూర్తి చేసిన అధికారులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర మార్కులను అన్ని సబ్జెక్టులతో కలిపి కాకుండా సపరేట్గా పొందుపరచాలని భావించడంవల్ల ఫలితాలు విడుదల లో కొంత జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

ఫలితాలు చెక్ చేసుకునే వెబ్సైట్:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోండి.

AP Inter 2026 Results Website

AP 10th Results 2026 Release Date | AP SSC 2026 Results Release Date

ఇంటర్మీడియట్ ఫలితాలు మరియు సప్లిమెంటరీ పరీక్షల యొక్క సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page