TS Inter 2026 Supplementary Exams Dates | Telangana intermediate 2026 supplementary exams schedule

By: Sivakrishna Bandela

On: April 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana intermediate 2026 supplementary exams schedule:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను అధికారికంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇప్పుడే విడుదల చేశారు. మొత్తం 9.97 లక్షల మంది ఈ ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను అధికారిక బోర్డు వెబ్సైట్ నుండి లేదా వాట్సాప్ సర్వీసెస్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఫలితాలు చూసుకున్న విద్యార్థులలో కొంతమంది మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు షెడ్యూల్ను ప్రకటించారు. సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు చూద్దాం.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:

తెలంగాణ ఇంటర్ 2026 ఫలితాలు చూసుకున్న తర్వాత ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వచ్చే నెలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. మే 13 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయని వెల్లడించింది. ఏప్రిల్ చివరి నాటికి విద్యార్థులు సబ్జెక్టుల వారీగా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టులకు ఫీజులను చెల్లించవలెను. ఫీజు చెల్లించిన విద్యార్థులకు హాల్ టికెట్స్ విడుదల చేసి మే నెలలో సప్లమెంటరీ రాత పరీక్షలు నిర్వహిస్తారు.

AP 10th Results 2026 Date | AP SSC Results 2026 Date | AP 10th Class 2026 Results Date – Chcek Details

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ఎప్పటిలోగా చెల్లించాలి?:

సప్లిమెంటరీ పరీక్షల యొక్క ఫీజులను ఏప్రిల్ 13 నుంచి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. కాలేజీ యాజమాన్యానికి గాని లేదా ఆన్లైన్లో ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో కాని విద్యార్థులు చెల్లించవలెను. సబ్జెక్టుల వారిగా ఫీజు చెల్లించిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలను ఈ క్రింది ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.

AP Inter Results 2026 Toppers List | AP Intermediate 2026 Results Toppers List
  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లోనికి లాగిన్ అవ్వండి
  2. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
  3. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
  4. వెంటనే ఆ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి
  5. ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.

TS INTER RESULTS WEBSITE

ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి నిరుత్సాహ పడకుండా, వారు ఏ సబ్జెక్టులలో ఎందుకు ఫెయిల్ అయ్యారో ముందుగా ఒక ఎనాలసిస్ చేసుకుని, సప్లిమెంటరీ రాత పరీక్షలో ఏ విధంగా చదివితే పాస్ అవుతామో దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. అవేమీ లేకుండా ఏదో ఎగ్జామ్ రాస్తున్నాం అన్నట్లుగా వెళ్లి మళ్లీ మీరు ఎగ్జామ్ రాస్తే సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ అవుతారు. కాబట్టి ముందుగా మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది తెలుసుకోండి. తర్వాత విజయం తానంతట అదే మీ దగ్గరకు వస్తుంది.

CBSE 10th Results 2026 Likely Today | Check CBSE Class 10 Result @results.cbse.nic.in

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page