TS Inter 2026 Results:
తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేస్తారు. ముందుగా ఒకేషనల్ కోర్సులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారి యొక్క ఫలితాలను విడుదల చేసి, ఆ తర్వాత మిగిలిన రెగ్యులర్ విద్యార్థుల యొక్క ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు వారి యొక్క ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ నుండి మరియు ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు.
How to check Telangana inter 2026 results:.
తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.
- ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana inter 2026 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- మీరు రాసిన పరీక్షల యొక్క సంవత్సరాన్ని ఎంపిక చేసుకోండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- సబ్జెక్టులు వారిగా మీకు వచ్చిన మార్కులు, అలాగే మీరు పాస్ అయ్యారా లేదా చెక్ చేసుకోండి
TS inter 2026 supplementary exam dates:
తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 రెగ్యులర్ పరీక్షల యొక్క ఫలితాలు విడుదలైన తరువాత, మొదటి సంవత్సర ఇంటర్మీడియట్ మార్కులను పెంచుకోవాలి అనుకునే విద్యార్థులు, మొదటి మరియు రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మీ మొదటి వారం లేదా రెండవ వారంలో సప్లమెంటరీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లమెంటరీ పరీక్ష ఫీజులను ఏప్రిల్ 30వ తేదీలోగా విద్యార్థులు ఆన్లైన్లో గాని లేదా కాలేజీ యాజమాన్యానికి చెల్లించవలెను.
FAQ’S:
1. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 12న ఏ సమయానికి విడుదల చేస్తారు?
ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 గంటలకు ఫలితాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.
2. మొత్తం ఎన్ని లక్షల మంది తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు?
దాదాపుగా 9.7 లక్షల మంది ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు 2026 లో రాశారు
3. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు?
తెలంగాణ ఇంటర్ 2026 సప్లిమెంటరీ ఆత పరీక్షలను మే మొదటి వారం లేదా రెండవ వారంలో నిర్వహించనున్నారు