TS Inter 1st & 2nd Year 2026 Results Release Date | Telangana Intermediate 2026 Results Date

By: Sivakrishna Bandela

On: March 18, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Inter 1st year and 2nd year result release date:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు నిన్నటితో ముగిశాయి. రెండవ సంవత్సర పరీక్షలు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల మూల్యాంకనం మార్చి 4వ తేదీ నుండి ప్రారంభించారు. మార్చి నెలాఖరు నాటికి ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి, మార్కులను ఆన్లైన్లో నమోదు చేసి ఏప్రిల్ 12వ తేదీలోగా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ముందుగా ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మొత్తం తొమ్మిది లక్షల మంది వరకు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఫలితాలు విడుదల చేసే తేదీ:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీలోగా విడుదల చేసేందుకు అధికారులు ప్రారంభించారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనం ముందుగానే పూర్తి చేసేందుకు ఈసారి మార్చి 4వ తేదీ నుండి పరీక్ష పత్రాల మూలికను పలు కేంద్రాల్లో ప్రారంభించడం జరిగింది. త్వరితగతిన ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి, త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు తెలియజేశారు.

How to check Telangana intermediate results 2026:

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఈ క్రింది ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు .

RRB NTPC GRADUATE 2026 Shift 2 Asked Questions Today | RRB NTPC 2026 Exam Analysis | Railway NTPC 2026 Exam Review
  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” Telangana Inter 1st year and 2nd year results 2026 ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
  5. మీరు పాస్ అయ్యారా లేదా చెక్ చేసుకోండి
  6. ఆ మార్క్స్ మెమోని భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి.

TGBIE Results Website

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఏ తేదీ నాటికి ముగుస్తాయి?

ఇప్పటికే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు మార్చి 17వ తేదీతో ముగుసాయి. రెండవ సంవత్సర పరీక్షలు మార్చి 18వ తేదీ నాటికి ముగియనున్నాయి

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students

2. మొత్తం ఎన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు?

దాదాపుగా 9 లక్షల మంది వరకు పరీక్షలు రాయనున్నట్లు సమాచారం

3. ఫలితాలు చెక్ చేసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?

ప్రారంభమైన తెలంగాణా 10వ తరగతి పరీక్షలు – రిజల్ట్స్ విడుదల తేదీ | TS 10th Results Date | Telangana SSC 2026 Results Date

tgbie.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page