Postal GDS 2026 Results:
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 2026 మొదటి మెరిట్ లిస్టు ఫలితాలు మార్చి 4వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. మొదటి మెరిట్ లిస్ట్ కి ఎంపికైన అభ్యర్థులు, మార్చి 23వ తేదీలోగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి. అయితే, పోస్టల్ జిడిఎస్ 2026 రెండవ మెరిట్ లిస్ట్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనేదానికి సంబంధించి నిరుద్యోగ అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ఫలితాలను మార్చి 31వ తేదీలలో విడుదల చేయనున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ వర్గాల సమాచారం. మొదటి మెరిట్ లిస్టులో ఎంపికైన వారు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కాని వారి ప్లేస్ లో తర్వాత స్థానంలో ఉన్న వారిని షార్ట్లిస్ట్ చేసి రెండవ మెరిట్ లిస్టులో, వారికి అవకాశం కల్పిస్తారు. పోస్టల్ జిడిఎస్ 2026 రెండవ మెరిట్ లిస్ట్ ఫలితాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చూద్దాం.
Postal GDS 20262nd Merit List Results Date:
పోస్టల్ జిడిఎస్ 2026 రెండో మెరిట్ లిస్టు ఫలితాలను మార్చి 31వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు పోస్టల్ అధికారుల సమాచారం ప్రకారం తెలుస్తోంది. మార్చి 23వ తేదీ వరకు మొదటి మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు.
Second merit list expected cutoff marks:
క్యాటగిరీల వారీగా పోస్టల్ జిడిఎస్ 2026 సెకండ్ మెరిట్ లిస్ట్ అంచనా కట్ ఆఫ్ మార్కులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- UR/General : 100
- OBC : 100
- SC: 100
- ST: 100
- PWD: 87
- EX Servicemen : 85
Note : పైన తెలిపిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పోస్టల్ సర్కిళ్లలో జాబ్ రావాలి అంటే, అభ్యర్థులకు పదో తరగతిలో ఉండవలసిన మార్కులు. ఆ సమాచారం గత ఫలితాలను అంచనా ప్రకారం ప్రిపేర్ చేయడం జరిగింది
ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
పోస్టల్ జిడిఎస్ 2026 రెండవ మెరిట్ లిస్టు ఫలితాలను ఈ క్రింది ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా పోస్టల్ జిడిఎస్ అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” postal GDS 2026 second merit list” డౌన్లోడ్ ఆప్షన్ తో క్లిక్ చేయండి.
- మీరు అప్లై చేసుకున్న సర్కిల్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకొని
- రెండవ మెరిట్ లిస్టు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి
- ఆ మెరిట్ లిస్టులో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి
- పేరు ఉన్నవారు ఇచ్చిన తేదీలోగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి
Postal GDS 2026 Results Website
పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు యొక్క సమాచారం కోసం ప్రతి రోజు మా వెబ్సైట్ని సందర్శించండి.