AP SSC 2026 Hall Tickets Not Released – New Date | AP 10th 2026 Hall Tickets @bse.ap.gov.in – Freejobsintelugu.com

By: Sivakrishna Bandela

On: March 3, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP SSC 2026 Hall Tickets Not Released – New Date:

ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న 9 లక్షల మందికి పైగా విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ హాల్ టికెట్లను మార్చి మూడో తేదీన అధికార వెబ్సైట్లో పెట్టినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సైట్ ఓపెన్ కాలేదు. దీంతో ఈ హాల్ టికెట్లను మరో రెండు మూడు రోజుల్లో అధికారికి వెబ్సైట్లో ఎటువంటి లోపాలు లేకుండా అప్లోడ్ చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈనెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన అన్న విషయం తెలిసిందే. అయితే, గురువారం లేదా శుక్రవారం హాల్ టికెట్లను విడుదల చేసి విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి మరియు మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించనున్నారు.

హాల్ టికెట్స్ విడుదల కాకపోవడానికి సంబంధించిన సమాచారంతోపాటు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

ఏపీ పదవ తరగతి 2026 హాల్ టికెట్స్ విడుదల చేసి కొత్త తేదీలు :

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి 2026 హాల్ టికెట్లను గురువారం లేదా శుక్రవారం రోజున విడుదల చేయనున్నట్లు ఎస్ఎస్సి బోర్డు అధికారులు సాక్షి మీడియాతో తెలిపారు.. అయితే ఈరోజు వెబ్సైట్లో లింక్ యాక్టివేట్ చేసినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యల కారణాలవల్ల, సైట్ ఓపెన్ కాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు ఎస్ఎస్సి బోర్డు అధికారులు తెలియజేశారు.

Ap SSC 2026 hall tickets update

How to download AP SSC 2026 hall tickets :

ఏపీ 10వ తరగతి 2026 హాల్ టికెట్లను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key
  1. ముందుగా ఏపీ పదవ తరగతి బోర్డు వెబ్సైట్ bse.ap.gov.in లోకి వెళ్లండి.
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” AP SSC 2026 hall tickets download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థులు యొక్క రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, స్కూల్ పేరు, జిల్లా పేరు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయండి.
  4. వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. హాల్ టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకొని, అందులో ఉన్న అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
  6. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే పాఠశాల హెడ్ మాస్టర్ లేదా బోర్డు యాజమాన్యాన్ని సంప్రదించండి.

AP SSC 2026 Hall Tickets

Important : పదో తరగతి హాల్ టికెట్ లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే వాటిని సరిదిద్దుకోవాలి. సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్ గాని లేదా పదో తరగతి బోర్డు అధికారులను వెంటనే సంప్రదించి వాటిని సరి చేసుకోవాలి. లేదంటే విద్యార్థులు భవిష్యత్తులో అడ్మిషన్స్ సమయంలో గానీ లేదా ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

10వ తరగతి పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ని ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page