TS Intermediate Results 2026 Official Date | Telangana Inter 1st Year & 2nd Year Results Date 2026 | TS Inter 2026 Results Date

By: Sivakrishna Bandela

On: February 24, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Intermediate Results 2026 Date:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర రెగ్యులర్ పరీక్షలను ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలను మొత్తం తొమ్మిది లక్షల మంది విద్యార్థులు వ్రాయనున్నారు. అయితే ఈ పరీక్షలు ముగిసిన వెంటనే మార్చే 25 నుండి 31వ తేదీలోగా ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కన్వీనర్ అధికారికంగా మీడియాకు తెలిపారు. అనగా పరీక్షలు ముగిసిన 12 రోజులలోగా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు విద్యార్థులు యొక్క ఓఎంఆర్ షీట్లను ముందుగానే పంపించడం జరిగిందని, పరీక్షలు పూర్తయిన వెంటనే పరీక్ష పేపర్స్ మూల్యాంకనం ప్రారంభించి, వెంటనే ఆ ప్రాసెస్ పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయనున్నట్లు కన్వీనర్ అధికారికంగా తెలిపారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు షెడ్యూల్ క్రింది విధంగా ఉంటుంది.

  • ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 25, 2026
  • ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ఆఖరు తేదీ: మార్చి 17, 2026
  • ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షలు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 26, 2026
  • ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షలు ఆఖరు తేదీ: మార్చి 18, 2026

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల తేదీ:

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కన్వీనర్ అధికారికంగా మీడియాకు తెలిపిన సమాచారం ప్రకారం :

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details
  • ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు మార్చి 18వ తేదీ నాటికి ముగిసిన వెంటనే పరీక్షల పత్రాల మూల్యాంకనం ప్రారంభించి, ఫలితాలను మార్చి 25వ తేదీ నుండి మార్చి 31వ తేదీలోగా విడుదల చేరినన్నట్లు కన్వీనర్ మీడియాకు అధికారికంగా తెలిపారు.
  • అనగా పరీక్షల పూర్తయిన 12 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
  • గతంలో ఇలా ఎప్పుడు ఇంత త్వరగా ఫలితాలు విడుదల కాలేదని, ఈసారి ఫలితాల్లో మార్చి 25 నుండి 31వ తేదీ లోగా విడుదల చేయనున్నామని ఆయన అన్నారు.

ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క హాల్ టికెట్లను వెబ్సైట్ నుండి క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “TS Inter 1st year and 2nd year 2026 hall tickets download” ఆప్షన్ క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ అఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. అది ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.
  6. హాల్ టికెట్ లో ఉన్న వివరాలు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి.

TS Inter Board Official Website

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 పరీక్షలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి?

ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 18వ తేదీన ముగుస్తాయి

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

2. ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి కన్వీనర్ తెలిపిన సమాచారం ప్రకారం?

ఫలితాలు మార్చి 25 నుండి 31వ తేదీలలో విడుదల చేయనున్నట్లు కన్వీనర్ మీడియాకు తెలిపారు.

ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు యొక్క అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com నువ్వు ప్రతిరోజు సందర్శించండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page