TS Inter Exams : Board Good News:
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాబోతున్న విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ పెద్ద శుభవార్త తెలిపింది. ఇకపై పరీక్ష కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు కూడా పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు శుభవార్త తెలిపింది.
కొత్త నిబంధనలు ఇవే:
ఇంటర్ పరీక్షల నిర్వహణలో భాగంగా, గతంలో అమలులో ఉన్న కఠిన నిబంధనలను కొంత సడలిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు స్వల్పంగా ఆలస్యంగా వచ్చిన పరీక్ష రాసే అవకాశం కల్పించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ఎందుకు ఈ మార్పు?:
ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలు, విద్యార్థుల అనుకోని ఆలస్యాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో చివరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి వచ్చే విద్యార్థుల్లో కొంత ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావించారు.
పరీక్ష సమయాలు యధావిధిగా :
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో ఉదయం 9:25 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశానికి అవకాశం ఉంటుంది.
ఉదయం 9:30 నిమిషాలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్య సూచనలు:
- విద్యార్థులు 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చే వరకు మాత్రమే అనుమతించారు
- అంతకుమించి ఆలస్యంగా వస్తే పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశం ఉండదు
- విద్యార్థులకు హాల్ టికెట్ తప్పనిసరి
- ఇంటర్ విద్యార్థులు ఇంటర్ బోర్డు నిర్దేశించిన పరీక్ష కేంద్రం యొక్క నిబంధనలను తప్పని సరిగా పాటించాలి
తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు:
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇంటర్ పరీక్షలను ఈ క్రింది తేదీలలో నిర్వహించనున్నారు.
- తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి.
కావున ఇంటర్ విద్యార్థులు ఇంటర్ బోర్డు కల్పించిన ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటర్ పరీక్షలు ఎటువంటి ఒత్తిడి లేకుండా రాయగలరు. ఇలాంటి తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి