TS inter supplementary exams 2025:
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర సప్లమెంటరీ రాత పరీక్షలు మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. అయితే పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై విద్యార్థుల్లో సందిగ్ధత నెలకొంది. మొత్తం 4.12 లక్షల మంది విద్యార్థులు ఈ ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, పరీక్షల ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ పరీక్షల ముగిసిన తర్వాత మే 7వ తేదీలోగా సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు నిర్ణయించారు. అయితే సప్లిమెంటరీ పరీక్షల్లో ఆదివారం ఒక్క రోజునే మొత్తం 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లుగా అధికారం తెలిపారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోని 22 కేసులు నమోదయ్యాయి. ఈ మాల్ ప్రాక్టీస్ కి పాల్పడినటువంటి విద్యార్థులను డిబార్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ ఆర్టికల్ ద్వారా ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనేది చూద్దాం.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 7వ తేదీలోగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు సూత్రప్రాయంగా తెలిపారు. విద్యార్థులు రిజల్ట్స్ విడుదలైన తర్వాత వారి యొక్క మొబైల్ లోనే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చని, ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోగలరు.
తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష హాల్ టికెట్స్
- ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో ” Telangana inter supplementary 1st year & 2nd year result ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన రిజల్ట్స్ యొక్క మార్క్స్ నెంబర్ డౌన్లోడ్ అవుతుంది
- మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీయండి.
FAQ’s:
1.తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఆఖరి తేదీ ఏమిటి?
మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు
2. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడు?
జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.