AP EAMCET 2025 :
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలు మే 27వ తేదీతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సెట్ చైర్మన్, జెఎన్టియు ఉపకులపతి అయిన CSRK ప్రసాద్ ఇతర ఇంటర్ బోర్డు విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా వారి యొక్క మార్కుల వివరాలను EAPCET వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారంలో అప్లోడ్ చేయాలని తెలిపారు. 25% వెయిటేజ్ మార్కులు కేటాయిస్తున్నందున ఈ మార్కులు తప్పనిసరిగా సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ , ఏపీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్ఎస్, డిప్లమా, ఇతర బోర్డుల 10+2 విద్యార్థులు వెంటనే అప్లోడ్ చేయాలని సర్కులర్ జారీ చేశారు. డిక్లరేషన్ ఫారం లో మార్కులు అప్లోడ్ చేయని విద్యార్థులకు 25% వెయిటేజ్ మార్కులు కలవమని తెలిపారు. కావున ఇతర ఇంటర్ బోర్డు విద్యార్థులు తప్పనిసరిగా ఇచ్చిన గడువులోగా మార్కులను సబ్మిట్ చేయాలి. పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏ ఇంటర్ బోర్డుల వారు మార్కులు అప్లోడ్ చేయాలి?:
ఈ క్రింద తెలిపిన ఇంటర్ బోర్డుల విద్యార్థులు మే 30వ తేదీలోగా మార్కులను అప్లోడ్ చేయవలసిందిగా జె.ఎన్.టి.యు ఉపకులపతి, సెట్ చైర్మన్ అయినా సి ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు.
- CBSE board
- ICSE board
- APOSS board
- NIOSS board
- diploma
- other board స్టూడెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇంటర్ మార్కులు ఎలా అప్లోడ్ చేయాలి?:
ఇతర ఇంటర్ బోర్డు విద్యార్థులు ఈ క్రింది తెలిపిన విధంగా మీ యొక్క ఇంటర్ మార్కులను అప్లోడ్ చేయండి మీకు 25 శాతం వెయిటేజ్ మార్కులు కలుస్తాయి.
నాకు ఏపీ ఎంసెట్ 2025 లో వంద మార్కులు వచ్చాయి నాకు ఎంత ర్యాంకు వస్తుంది
- ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో “Declaration Form” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- రిజిస్ట్రేషన్ నెంబర్ , హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
- ఆ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్లో వచ్చినటువంటి మార్కుల వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- ఇలా ఎంటర్ చేయడం ద్వారా మీకు వెయిటేజ్ మార్కులు కలిసి ర్యాంకు మెరుగైనటువంటి ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది
ఏపీ ఎంసెట్ 2025 ఆన్సర్ కి విడుదల తేదీ :
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఆన్సర్ కీ ని మే 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇంజనీరింగ్ పరీక్షలకి సంబంధించిన ఆన్సర్ కీ ని మే 28వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
పైన తెలిపిన విధంగా ఇతర ఇంటర్ బోర్డు విద్యార్థులు మీ యొక్క ఇంటర్ మార్కులను అప్లోడ్ చేయగలరు.