TS inter supplementary exams 2025:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షలు ఈరోజు నుంచి మొదలయ్యాయి. 4.12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయండి అన్నారు. మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు రోజుకి రెండు షిఫ్ట్లవారిగా మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఇంటర్ రాత పరీక్షలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్నారు. 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు వారి యొక్క మార్కులను పెంచుకోవడానికి కొంతమంది, మరి కొంతమంది ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. రెండో సంవత్సరం విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి వారు పరీక్షలు రాసి డిగ్రీ అడ్మిషన్స్ పొందాలని రాస్తున్నారు. అయితే ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత వారం పది రోజుల్లో అనగా జూన్ 7వ తేదీ నాటికి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని విధాల సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు?:
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 22వ తేదీ నుండి మే 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షలు పూర్తయిన వారం పది రోజుల్లో గా ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు విడుదల చేసిన తర్వాత విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే వెంటనే ఫలితాలు చెక్ చేసుకునే విధంగా పోర్టల్ని సిద్ధం చేయడం జరిగింది.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎలా చెక్ చేసుకోవాలి :
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షను అధికారిక వెబ్సైట్లో ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా చూసుకోవచ్చు.
- ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ (Website Link) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” Telangana inter supplementary 1st year and 2nd year results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి
- మాక్స్ మెమో డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు చూసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్కులు మరియు ఫలితాలు వివరాలను క్రింది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు.