AP 10th Results 2026:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాలను రేపు అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తెలియజేశారు. మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ రెండో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 6.5 లక్షల మంది విద్యార్థులు ఈ పదవ తరగతి పరీక్షలను రాశారు. ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం మరియు మార్కుల నమోదు ప్రక్రియ పూర్తిచేసుకున్న బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పుడు ఫలితాలను విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యారు. పరీక్షల యొక్క ఫలితాలను వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా, ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్ ద్వారా అలాగే ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఏపీ 10వ తరగతి ఫలితాలు 2026 విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీన మంత్రి నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ఫలితాలు విడుదలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 6.5 లక్షల మంది విద్యార్థులు యొక్క ఫలితాలను ఒకేసారి అధికారిక వెబ్సైట్ నుండి వాట్సాప్ మనమే క్రాఫ్ట్ విషెస్ నుండి అలాగే ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలియజేశారు.
How to check AP SSC 2026 results :
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి 2026 పరీక్షలకు ఫలితాలను ఈ క్రింది స్టెబిస్తే ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి.
- ముందుగా ఏపీ ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP SSC 2026 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- సబ్జెక్టుల వారిగా మీకు వచ్చిన మార్కులను చెక్ చేసుకొని, ఫలితాల్లో మీరు పాస్ అయ్యారా లేదా చూసుకోండి.
- డౌన్లోడ్ అయిన మార్క్స్ మెమో అని ప్రింట్ అవుట్ తీసుకోండి
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను చూసుకున్న తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెల చివరి వారంలోగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ లో జాయిన్ అవ్వచ్చు.