AP POLYCET 2026:.
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించిన ఏపీ పాలీసెట్ 2026 పరీక్షల యొక్క ప్రాథమిక కీని ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు ఉన్నత సాంకేతిక విద్య మండలి తెలిపింది. ఏప్రిల్ 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు ప్రాథమికకి మరియు ఫైనల్ కీ విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రాథమిక కిలో ఏమైనా తప్పులు ఉంటే, వాటికి విద్యార్థులు అబ్జెక్షన్స్ పెట్టుకునే విధంగా మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉన్నత విద్యా మండలి సమయం ఇస్తుంది. కాబట్టి పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకొని కిలో ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
ఏపీ పాలీసెట్ 2026 ఆన్సర్ కీ విడుదల తేదీ:
ఏపీ పాలీసెట్ 2026 ప్రాథమిక ఆన్సర్ కీని ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. విద్యార్థులు అధికారిక ఏపీ పాలీసెట్ వెబ్సైట్ నుండి గాని లేదా మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వడం ద్వారా ప్రాథమికకి డౌన్లోడ్ అవుతుంది.
How to download AP polycet 2026 answer key:
ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2026 ప్రాథమిక ఆన్సర్ కీ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా ఏపీ పాలీసెట్ అధికారిక వెబ్ సైట్ లోనికి వెళ్ళండి
- వెబ్సైట్ హోం పేజ్ లో “AP Polycet 2026 Answer Key Download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన మీరు రాసిన పరీక్ష పత్రం ఆన్సర్ కీ తో డౌన్లోడ్ అవుతుంది
- డౌన్లోడ్ అయిన ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదో చెక్ చేయండి
- తప్పులో ఉన్న ఆన్సర్ కీ లకు అబ్జెక్షన్స్ పెట్టుకోండి మార్కులు కలుస్తాయి.
ఆన్సర్ కి చూసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్పులను బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుందో అంచనా వేసే ప్రయత్నం చెయ్యండి గత సంవత్సరాల ర్యాంకుల ఆధారంగా. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ని చెక్ చేయండి.