AP Inter Results 2026 Toppers List | AP Intermediate 2026 Results Toppers List

By: Sivakrishna Bandela

On: April 15, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter Results 2026 Toppers List:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఇప్పుడే విడుదల చేశారు. ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ జిల్లాల వారీగా ఏ జిల్లాలో టాప్ లో నిలిచాయి, అలాగే అమ్మాయిలు మరియు అబ్బాయిలలో ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ మార్కులు వచ్చాయి అనేదానికి సంబంధించి వివరాలను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే జిల్లాల వారీగా టాప్ ర్యాంక్ లో నిలిచిన లిస్ట్ చూడండి.

AP ఇంటర్ రిజల్ట్స్ లో టాప్ లో నిలిచిన జిల్లాలు ఇవే:

  • ఏపీ ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ (90%), సెకండియర్(92%)లో కృష్ణా జిల్లా టాప్ ప్లేసులో నిలిచింది.
  • ఫస్ట్(88%), సెకండియర్(88%)లో ఉత్తీర్ణతతో గుంటూరు రెండో ప్లేస్ దక్కించుకుంది.
  • ఇక ఫస్టియర్లో 85 శాతంతో వైజాగ్ జిల్లా, సెకండియర్లో 87శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడో ప్లేసులో నిలిచాయి.
  • రెండు తరగతుల్లో 62% పాస్ పర్సంటేజ్తో అన్నమయ్య జిల్లా చిట్టచివరి ప్లేసుకు పరిమితమైంది.

ఏపీ ఇంటర్ రిజల్ట్స్ లో.. అదరగొట్టేసిన అమ్మాయిలు:

  • ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు.మొత్తంగా ఫస్టియర్లో 3,61,526 మంది, సెకండియర్ లో 3,59,816 మంది విద్యార్థులు పాసయ్యారు.
  • వీరిలో బాలికలు ఫస్టియర్లో 81%, సెకండియర్లో 85% ఉత్తీర్ణత సాధించారు. బాలురు ఫస్టియర్లో 72%, సెకండియర్లో 76% మంది పాస్ అయ్యారు.

ఏపీ ఇంటర్ 1st & 2nd ఇయర్ పాస్ పర్సంటేజ్:

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంత్రి లోకేశ్ ‘X’ వేదికగా విడుదల చేశారు. ఫస్టియర్లో 77%, సెకండియర్లో 81% ఉత్తీర్ణత నమోదైంది. గత పన్నెండేళ్లలో ఇదే అత్యధిక పాస్ పర్సంటేజ్ అని లోకేశ్ తెలిపారు.

AP Polycet 2026 Final Results Release Date | AP Polycet 2026 Final Key Release Date

ఇంటర్ ఫలితాల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబర్చినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఫస్టియర్ స్టూడెంట్స్ 12 ఏళ్లలోనే అత్యధికంగా 54 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు చేసినట్లు వెల్లడించారు. సెకండియర్ విద్యార్థులు 68 శాతంతో 12 ఏళ్లలో రెండో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన లెక్చరర్లు, ప్రిన్సిపల్స్, స్టూడెంట్లకు అభినందనలు తెలిపారు.

ఫలితాలు ఇంకా చూసుకోలేదా? వెంటనే ఎలా చెక్ చేయండి:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు ఫలితాలు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చూడండి.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు విడుదల | AP 10th Class Results 2026 Released | AP SSC Results 2026 Released
  1. ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2026 అని లింక్ పైన క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
  5. మార్కులు చెక్ చేసుకుని, మార్కుల మెమోలను ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP Inter Results 2026 Download Now

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండండి.

ఈరోజు తెలంగాణ పదవ తరగతి 2026 ఫలితాలు విడుదల | Telangana 10th 2026 results out | TS 10th Results 2026 Released

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page