AP Inter Results 2026 Date : ఏపీ ఇంటర్మీడియట్ 2026 పరీక్షల విడుదల తేదీ ఇదే – పూర్తి వివరాలు

By: Sivakrishna Bandela

On: April 8, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter Results 2026 Date:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన వెంటనే రెండు సంవత్సరాల ప్రశ్నాపత్రాల మూల్యాంకనాన్ని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ప్రారంభించారు. మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే తొలి దశకు చేరుకుంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, ఏప్రిల్ 16వ తేదీ నుండి 19వ తేదీ మధ్యలో ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈనెల తొమ్మిదో తేదీ నాటికి పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి చేయనున్నారు. మూల్యాంకనం పూర్తి అయిన తర్వాత ఆరు లేదా ఏడు రోజుల్లో ఫలితాల ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఉంటుంది. అది పూర్తయిన వెంటనే విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. ఈసారి ఫలితాలను అధికారిక వెబ్సైట్ తో పాటు వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా అలాగే ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి విద్యార్థులు వారి యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి మార్కులను పెంచుకోవాలి అనుకునే విద్యార్థులకు, సప్లమెంటరీ రాత పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించనున్నారు.

Telangana 10th Class 2026 Results Date | TS 10th 2026 Results Date – How To Check Step By Step Process

సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు ఫీజులు చెల్లించి హాల్ టికెట్స్ పొంది పరీక్షలకు హాజరు కావలెను.

అయితే ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ముందుగా ప్రాథమిక సబ్జెక్టుల ఫలితాలను విడుదల చేసి ఆ తర్వాత ఆప్షనల్ సబ్జక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలను తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఫలితాలను ఈనెల 16వ తేదీ నుండి 19వ తేదీ మధ్యన విడుదల చేసి, సప్లిమెంటరీ పరీక్ష యొక్క ప్రక్రియ ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

అధికారిక వెబ్సైట్లో వచ్చిన సమాచారం మాత్రమే విద్యార్థులు నమ్మాలి. అనధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారం చూసి మోసపోవద్దని అధికారులు తెలియజేస్తున్నారు.

AP 10th Results 2026 Release Date | AP SSC 2026 Results Release Date

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page