AP 10th Results 2026 Date : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసే తేదీ ఇదే – పూర్తి వివరాలు

By: Sivakrishna Bandela

On: April 8, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 10th Results 2026 Date:

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 పరీక్షలు ఏప్రిల్ రెండవ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్ష పత్రాల యొక్క మూల్యాంకనం మార్చి నెలలోనే ప్రారంభించారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం మరికొద్ది రోజుల్లో పూర్తి చేసి, వెంటనే ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు మూల్యాంకనం ప్రక్రియ ఉంటుంది, తర్వాత సబ్జెక్టుల వారీగా మార్కుల నమోదు పూర్తి చేసి ఏప్రిల్ 25వ తేదీ తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నారు.

పరీక్ష పత్రాల మూల్యాంకనం చేసే టీచర్లు, రోజుకు 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఉదయం 20 పేపర్లు, మధ్యాహ్నం 20 పేపర్ల చొప్పున రోజుకి 40 పేపర్లు పూర్తి చేయాలి. మూల్యాంకనంలో ఎటువంటి తప్పులు లేకుండా పేపర్లను దిద్దాలని, సాయంత్రం 6 గంటల వరకు స్పాట్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది అని బోర్డు అధికారులు మీడియాకు తెలిపారు.

AP Inter Results 2026 Date : ఏపీ ఇంటర్మీడియట్ 2026 పరీక్షల విడుదల తేదీ ఇదే – పూర్తి వివరాలు

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మూల్యాంకనం చేయడానికి 85 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 510 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 245 మంది సహాయకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొననున్నారు. 45 ట్యాబ్ లను మూల్యాంకన ప్రక్రియ కోసం ఉపయోగిస్తున్నారు. ఈసారి మూల్యాంకనంలో మార్కులను లెక్కించడానికి ఎటువంటి తప్పులు దొరలకుండా ఉండేందుకు ట్యాబ్ లను ఉపయోగిస్తున్నారు. ఈ సంవత్సరం 6.22 లక్షల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.

అయితే, ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షల్లోని హిందీ పేపర్లో తప్పులు దొర్లినందున రెండు మార్కులు, ఇంగ్లీష్ పేపర్ కి నాలుగు మార్కులు చొప్పున మొత్తం ఆరు మార్కులను మొత్తం విద్యార్థులకు కలపనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 25 తేదీ నాటికి విడుదల చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నారు.

పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ : ఫలితాలు విడుదల తేదీ ఫిక్స్

ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ రాసుకునే విధంగా మే నెలలో ఫీజులను వసూలు చేసి పరీక్షలు నిర్వహించడానికి సంసిద్ధం అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు యొక్క వివరాలను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ నందు ఫలితాలు చూసుకోవచ్చు. పూర్తి వివరాలు కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని చెక్ చేయండి.

ఏపీ, తెలంగాణలో ఇంటర్ ఫలితాల డేట్స్ వచ్చేశాయి | AP Inter Results 2026 | TS Inter Results 2026

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page