ఏపీ ఇంటర్ 2026 పరీక్ష పత్రాలు మూల్యాంకనం ప్రారంభం: ఫలితాలు విడుదల చేసే తేదీ | AP Inter 2026 Results Release Date | AP Inter Results 2026

By: Sivakrishna Bandela

On: March 23, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP intermediate 2026 results release date:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2006 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలను మార్చి 18వ తేదీకి పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రధాన పరీక్షలు ముగిసిన తర్వాత ఇంటర్ బోర్డు అధికారులు పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ఈరోజు నుంచి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు రాశారు. పరీక్ష పత్రాలు మూల్యాంకనాన్ని త్వరగా పూర్తిచేసి ఏప్రిల్ మొదటి వారం లేదా రెండో వారంలోగా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి రంజిత్ భాష తెలిపారు. పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులు చేసిన లెక్చరర్ లను కఠినంగా శిక్షిస్తామని అందుకు సంబంధించిన ఉత్తర్వులు విద్యాశాఖ అధికారులు జారీ చేశారు. తప్పుగా పరీక్ష పత్రాల మూల్యాంకనం చేసిన లెక్చరాలకు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.

ఏపీ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలోగా విడుదల చేసేందుకు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు నుండి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. పరీక్ష పత్రాల మూల్యాంకులని త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్రంలోని 25 జిల్లాలలో పరీక్ష పత్రాలు మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Telangana 10th Class 2026 Results Date | TS 10th 2026 Results Date – How To Check Step By Step Process

పరీక్ష పత్రాల మూల్యాంకనం ఉదయం 15 పేపర్లు మధ్యాహ్నం 15 పేపర్లు కరెక్షన్ చేసే విధంగా లెక్చరర్లను ఏర్పాటు చేశారు. మూల్యాంకనంలో పొరపాట్లు చేసిన వారికి ₹3 వేల నుండి ₹7500/- వరకు, వాటిని పరిశీలించిన వారికి 2000 నుండి 3500 వరకు జరిమానా విధిస్తామని, మూల్యాంకనంలో భారీగా వ్యత్యాసం వచ్చినట్లయితే సంబంధిత లెక్చరర్ లను మూల్యాంకనం నుండి డిబార్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే, ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలు విడుదలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించలేదు. విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ద్వారా అధికారిక వెబ్సైట్ నుండి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT

AP Inter Results 2026 Website

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల యొక్క ఫలితాలు సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు చెక్ చేయండి

AP 10th Results 2026 Release Date | AP SSC 2026 Results Release Date

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page