TS 10th 2026 Hall Tickets Download:
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకి సంబంధించినటువంటి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని తెలంగాణ విద్యాశాఖ మార్చింది. ఇకపై హాల్ టికెట్లను డైరెక్ట్గా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపించే విధంగా ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఈ విధానం ఇంటర్ విద్యార్థులకు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇకపై పదో తరగతి విద్యార్థులకు కూడా వారి యొక్క మొబైల్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లను నేరుగా పంపిస్తారు. దీనితోపాటు విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్లను బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. అయితే ఈ పదవ తరగతికి సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
TS 10th 2026 Hall Tickets Release Date:
తెలంగాణ 10వ తరగతి 2026 పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను మార్చి 5 2026 తేదీన విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఈసారి హాల్ టికెట్లను పాఠశాల యాజమాన్యానికి కాకుండా, డైరెక్ట్ గా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క వాట్సాప్ నంబర్లకు హాల్ టికెట్ ను పంపించే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే విద్యార్థులు 10వ తరగతి బోర్డు వెబ్సైట్ నుండి కూడా హాల్టికెట్లను వారి వివరాలతో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని బోర్డు తెలిపింది.
How to download Telangana SSC 2026 hall tickets:
తెలంగాణ పదవ తరగతి 2026 హాల్ టికెట్లను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
- వెబ్ సైట్ హోం పేజీలో “TS 10th 2026 Hall Tickets Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
- అది ప్రింట్ అవుట్ తీసుకోండి.
- హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి
- తప్పులు ఉన్నట్లయితే స్కూల్ హెడ్ మాస్టర్ లేదా యాజమాన్యాన్ని సంప్రదించి తప్పులు సరిదిద్దుకోండి.
TS 10th 2026 Hall Tickets Download
FAQ’s:
1. తెలంగాణ పదవ తరగతి 2026 హాల్ టికెట్స్ విడుదలయ్యే తేదీ?
మార్చ్ 5, 2026 తేదీన విడుదల చేయనున్నారు
2. మొత్తం ఎన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు?
దాదాపుగా 9 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో పరీక్షలు రాస్తారు
3. పరీక్షలు ప్రారంభమయ్యే తేదీ?
మార్చి 14 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు 2026 పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.