Postal GDS 2026 Results OFFICIAL Date | Postal GDS 2026 Merit List Release Date | India Post GDS 2026 Results

By: Sivakrishna Bandela

On: March 2, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS 2026 Results:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 2026 (Postal GDS 2026) మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలను మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు పోస్టల్ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయాల్సిన ఫలితాలను కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. మొత్తం 28,600 కి పైగా విడుదలైన పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఎంతోమంది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసిన పోస్టల్ శాఖ ఈ ఫలితాలను మరో మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. పోస్టల్ జిడిఎస్ ఫలితాలకు సంబంధించిన ప్రధాన అంశాలను ఇప్పుడు చూద్దాము.

పోస్టల్ GDS 2026 ఫలితాలు విడుదల చేసే తేదీ:

పోస్టల్ జిడిఎస్ 2026 మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలను మార్చి 05, 2026వ తేదీన విడుదల చేయనున్నట్లు పోస్టల్ శాఖ గ్రామీణ డాక్ సేవక్ యొక్క విభాగానికి సంబంధించిన అధికారులు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి అధికారిక వెబ్సైట్లో పిడిఎఫ్ రూపంలో విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన లింకు పైన క్లిక్ చేసి పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ మెరిట్ లిస్టులో అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ ఐడి లేదా పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

How to download postal GDS 2026 merit list:

పోస్టల్ జిడిఎస్ 2026 మెరిట్ లిస్టు ఫలితాలను క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా పోస్టల్ జిడిఎస్ ఆన్లైన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో scroll అవుతున్న “Postal GDS 2026 Schedule-1 Merit List Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థి అప్లై చేసిన పోస్టల్ సర్కిల్ యొక్క రాష్ట్రాన్ని ఎంపిక చేయండి
  4. వెంటనే మొదటి మెరిట్ లిస్టు ఫలితాలు యొక్క పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
  5. అందులో అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ ఐడి లేదా పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
  6. పేరు ఉన్నట్లయితే పోస్టల్ అధికారులు ఇచ్చిన గడువులోగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి

Postal GDS 2026 Results

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

ఫలితాలు విడుదలకు ఆలస్యానికి గల కారణాలు:

పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలను గతంలో తెలిపినట్లుగా ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కానీ వెబ్సైట్లో తలెత్తిన కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ఫలితాలను వాయిదా వేసినట్లు పోస్టల్ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ఫలితాలను మరొక మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

పోస్టల్ జిడిఎస్ 2026 ఫలితాలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం ఆ వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page