Postal GDS 2026 Results & 22 States Cut Off Marks:
భారత తపాలం శాఖ నుండి విడుదలైన 28,636 పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క మొదటి మెరిట్ లిస్టు ఫలితాలను మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న 23 పోస్టల్ సర్కిల్ ల రాష్ట్రాల నుండి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు కేటగిరీల వారీగా పదవ తరగతిలో ఎన్ని మార్కులు వస్తే పోస్టల్ జిడిఎస్ జాబ్ వస్తుందో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా గత సంవత్సరాలను ఆధారంగా చేసుకుని ఎన్ని మార్కులు వస్తే జాబు వస్తుందో పూర్తి వివరాలు చూడండి.
Postal GDS 2026 First Merit List Date:
పోస్టల్ జిడిఎస్ 2026 ఉద్యోగాలకు సంబంధించిన మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలను మార్చి 5, 2026వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న బుద్ధులు అధికారిక వెబ్సైట్ నుండి మెరిట్ లిస్టు ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావలెను.
State Wise, Category Wise Postal GDS Cut Off Marks:
పోస్టల్ జిడిఎస్ 2026 ఉద్యోగాలకి అభ్యర్థులు ఎంపిక కావాలి అంటే పదవ తరగతిలో వారికి వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్టు చేసి ఉద్యోగాలు ఇస్తారు. అయితే కంప్యూటర్ ఆధారంగా షార్ట్ లిస్టు చేసే ఈ ప్రక్రియలో పదో తరగతిలో ఏ రాష్ట్రంలోని వారికి ఎన్ని మార్కులు వస్తే జాబు వస్తుందో ఈ క్రింది అంశాలను ఆధారంగా చేసుకొని కట్ ఆఫ్ మార్కులు ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే గత సంవత్సర ఫలితాలలో అభ్యర్థులకు ఎన్ని మార్కులు వస్తే జిడిఎస్ జాబ్స్ వచ్చాయో, వాటిని ఆధారంగా చేసుకుని ప్రిపేర్ చేసాము.
- మొత్తం విడుదలైన పోస్టుల సంఖ్య
- మొత్తం అప్లై చేసుకున్న అభ్యర్థుల సంఖ్య
- పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులు
- అలాగే వయోపరిమితి ఎక్కువగా ఉన్నవారు. వీటిని ఆధారంగా చేసుకొని కట్ ఆఫ్ మార్కులను నిర్ణయిస్తారు.
• 23 Circle States Cut Off Marks List:
| Circle States | UR | EWS | OBC | SC | ST | PWD |
| Andhra Pradesh | 100 | 100 | 100 | 100 | 99.5 | 90 |
| Assam | 95 | 95 | 93 | 90 | 88 | 83 |
| Bihar | 98 | 98 | 96 | 90 | 89 | 85 |
| Chhatisgarh | 98 | 98 | 96 | 90 | 89 | 85 |
| Delhi | 100 | 100 | 100 | 100 | 100 | 90 |
| Gujarat | 98 | 98 | 96 | 93 | 93 | 87 |
| Haryana | 100 | 100 | 98 | 95 | 95 | 87 |
| Himachal Pradesh | 100 | 100 | 98 | 95 | 93 | 85 |
| Jammu & Kashmir | 97 | 97 | 94 | 89 | 85 | 80 |
| Jharkhand | 97 | 97 | 93 | 85 | 85 | 78 |
| Karnataka | 100 | 100 | 100 | 100 | 100 | 90 |
| kerala | 100 | 100 | 100 | 100 | 100 | 90 |
| Madhya Pradesh | 98 | 98 | 95 | 92 | 92 | 85 |
| Maharastra | 100 | 100 | 98 | 95 | 95 | 87 |
| North Eastern Circle | 89 | 89 | 85 | 80 | 78 | 65 |
| Odissa | 100 | 100 | 98 | 95 | 95 | 90 |
| Punjab | 100 | 100 | 100 | 98 | 95 | 88 |
| Rajasthan | 100 | 100 | 98 | 95 | 95 | 88 |
| Tamilnadu | 100 | 100 | 100 | 100 | 100 | 90 |
| Telangana | 100 | 100 | 100 | 100 | 100 | 90 |
| Uttarakhand | 97 | 97 | 94 | 90 | 90 | 85 |
| Uttar Pradesh | 100 | 100 | 98 | 95 | 93 | 87 |
| West Bengal | 100 | 100 | 98 | 95 | 95 | 85 |
Note: పైన తెలిపిన కట్ ఆఫ్ మార్కులు గత ఫలితాలయొక్క కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా అంచనా వేసిన % మార్కులు మాత్రమే. అసలు కట్ ఆఫ్ మార్కులు అధికారిక ఫలితాల్లో చూడవచ్చు.
పోస్టల్ GDS 2026 ఫలితాల అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ని ప్రతి రోజూ సందర్శించండి.