AP 10th 2026 Students – Big Update:
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి చదువుతున్న 2026 కి సంబంధించినటువంటి విద్యార్థులకు మరియు పాఠశాల యాజమాన్యాలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. పరీక్షల విభాగం నామినల్ రోల్స్ లో ఉన్న తప్పులను సరిచేసుకునేందుకు ప్రత్యేకమైన అవకాశం కల్పించింది.
పేరు, పుట్టిన తేదీ ( date of birth) వంటి వివరాల్లో ఏమైనా తప్పులు దొర్లినట్లయితే వెంటనే సరి చేసుకోవాలి.
ఎలాంటి వివరాలు సరి చేసుకోవచ్చు?:
- పదవ తరగతి చదువుతున్న విద్యార్ధి పేరులోని స్పెల్లింగ్ తప్పులు
- పుట్టిన తేదీ ( date of birth) లోని పొరపాట్లు
- ఇతర ప్రాథమిక వ్యక్తిగత వివరాలు
- వీటిని సరిచేసుకునే అవకాశం ఉంది
అయితే పైన తెలిపినటువంటి వివరాలు ఆధార్ కార్డు ని ఆధారంగా చేసుకుని మాత్రమే సరి చేసుకోవాలి
ఈ మార్పులు UDISE+ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
- సవరణలకు అవకాశం: ఈ తప్పులను సరి చేసుకోవడానికి ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు సమయం కల్పించారు.
- పదవ తరగతి పరీక్షల ప్రారంభ తేదీ : మార్చి 16, 2026
Note: ఈ తేదీల తర్వాత మార్పులకు ఎటువంటి అవకాశం ఉండదు.
ఎందుకు ఇది ముఖ్యమంటే:
నామినల్ రోల్స్ లో తప్పులు ఉంటే,
- హాల్ టికెట్లో వివరాలు తప్పుగా నమోదు అయ్యే అవకాశం ఉంటుంది
- పదవ తరగతి మార్కుల మెమోలో పొరపాట్లు రావచ్చు
- భవిష్యత్తులో ఇంటర్లో జాయిన్ అవుతున్నప్పుడు అలాగే ఉద్యోగాల వివరాల్లో తప్పులు పడే అవకాశం ఉంటుంది
అందుకే ఫిబ్రవరి 28వ తేదీలోగా స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి తప్పులు సవరించుకోవాలి.
విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సూచనలు:
- ముందుగా మీ ఆధార్ కార్డు వివరాలు సరైనవా లేదా చెక్ చేసుకోండి
- స్కూల్ యాజమాన్యం ద్వారా UDISE+ అప్డేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి
- పదవ తరగతి హాల్ టికెట్ వచ్చాక మళ్ళీ వివరాలు ఒకసారి చెక్ చేసుకోండి.
పదవ తరగతి పరీక్షలో ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ కాబట్టి, చిన్న తప్పిదం కూడా భవిష్యత్తులో విద్యార్థులకు పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీలోగా మీ యొక్క వివరాలను సరిచూసుకోండి.
ఈ సమాచారాన్ని పదవ తరగతి చదువుతున్న మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి.