తెలంగాణ టెట్ పరీక్షలు 2026 – పాటించవలసిన నియమాలు, తీసుకువెళ్లాల్సిన సర్టిఫికెట్స్ ఇవే | Telangana TET 2026 Exams important instructions | Full Details

By: Sivakrishna Bandela

On: January 2, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana TET 2026 exams Important Details:

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 పరీక్షలను జనవరి 3 తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకి 2.37లక్షల మంది విద్యార్థులు అప్లికేషన్స్ పెట్టుకున్నట్లుగా విద్యాశాఖ అధికారులు తెలిపారు. రోజుకి రెండు షిఫ్ట్ ల వారీగా పరీక్షలు నిర్వహించినట్లు విద్యాశాఖ తెలిపింది. పరీక్షలు ఆన్లైన్లో కంప్యూటర్ లో నిర్వహించనున్నారు. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు, అలాగే పరీక్షకు వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్లాల్సిన ముఖ్యమైన సర్టిఫికెట్ల గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

తెలంగాణ టెట్ 2026 పరీక్షల ముఖ్య సమాచారం:

  • పరీక్ష పేరు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026
  • పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
  • పరీక్షలు నిర్వహించే తేదీలు: జనవరి 3 నుండి జనవరి 31 వరకు
  • మొత్తం ఎంతమంది అప్లై చేశారు : 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
  • ఇప్పటికే హాల్టికెట్స్ విడుదల చేశారు. డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు:

  1. తెలంగాణ టెట్ పరీక్ష రాసా అభ్యర్థులు టెట్ పరీక్ష ఒక హాల్ టికెట్ ని ముందుగానే డౌన్లోడ్ చేసుకోవాలి.
  2. అభ్యర్థుల యొక్క పరీక్ష కేంద్రానికి 60 నిమిషాలు ముందుగానే చేరుకోవాలి.
  3. అభ్యర్థులకు కేటాయించిన షిఫ్ట్ టైమింగ్ అసలు మిస్ అవ్వకండి.
  4. ఒక్క నిమిషం ఆలస్యమైనా గేట్ లోపలికి అనుమతించరు. కావున మీ పరీక్ష కేంద్రానికి త్వరగా చేరుకోండి.
  5. మీ పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే సందర్శించండి. తద్వారా మీ పరీక్ష కేంద్రానికి పరీక్ష రోజు చేరుకోవడానికి మీకు ముందుగానే లొకేషన్ తెలుస్తుంది.

అవసరమైన డాక్యుమెంట్స్ లిస్ట్ :

తెలంగాణ టెట్ 2026 పరీక్షలకు హాజరయ్య అభ్యర్థులు కచ్చితంగా కింద తెలిపిన సర్టిఫికెట్లను వెంట తీసుకొని వెళ్ళాలి.

AP Polycet 2026 Hall Tickets Released | AP Polycet 2026 Admit Cards OUT
  • తెలంగాణ టెట్ 2026 పరీక్షలు యొక్క హాల్ టికెట్ ప్రింటెడ్ కాఫీ
  • ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ ( ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, కాలేజ్ ఐడి, లేదా ఇతర భారత ప్రభుత్వ గుర్తింపు ఐడి కార్డు) తీసుకువెళ్లాలి
  • రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్
  • బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్

పరీక్ష హాల్లోకి తీసుకువెళ్లకూడని వస్తువులు:

తెలంగాణ టట్టు పరీక్షకు హాజరు ఎవరు ఈ క్రింది వస్తువులను అస్సలు తీసుకువెళ్లకూడదు.

  1. మొబైల్ ఫోన్
  2. స్మార్ట్ వాచ్ లేదా డిజిటల్ వాచ్
  3. బ్లూటూత్ డివైసెస్
  4. క్యాలిక్యులేటర్
  5. పేపర్లు, నోట్స్ లేదా బ్యాగ్స్ తీసుకువెళ్ళకూడదు

టెట్ పరీక్ష రోజు అభ్యర్థులు చేయవలసిన పని:

  • బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి.
  • మీకు కేటాయించిన కంప్యూటర్ సిస్టం సీట్లోనే మీరు కూర్చోవాలి
  • పరీక్ష జరుగుతున్న సమయంలో ఇతర అభ్యర్థులతో మాట్లాడకూడదు
  • ప్రశ్నలు అర్థం కాకపోతే కంగారు పడకుండా పరీక్షను ప్రశాంతంగా రాయాలి.

టెట్ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి.

APPGECET 2026 Admit Cards Released | APPGECET 2026 Hall Tickets Released – Download Now

NEET UG 2026 Admit Card Date | NEET UG 2026 Admit Card Download Link – Step By Step Process

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page