Telangana Inter 1st Year 2026 Hall Tickets Released | TS Inter 2026 1st Year Hall Tickets OUT | Step By Step Process

By: Sivakrishna Bandela

On: February 18, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter 1st Year Hall Tickets OUT:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వారి యొక్క పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధంగా తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల హాల్ టికెట్లను ఫిబ్రవరి 18, 2026 (బుధవారం) రోజున విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. హాల్ టికెట్లు విడుదలైన తర్వాత విద్యార్థులు ఇంటర్ బోర్డు లాగిన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు. అలాగే ఫిబ్రవరి 20వ తేదీన విద్యార్థి యొక్క తల్లిదండ్రుల రిజిస్టర్ వాట్సాప్ నెంబర్ కు హాల్ టికెట్లను పంపించమన్నారు. దీంతో విద్యార్థులు నేరుగా వాట్సాప్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇంటర్ బోర్డు వెబ్సైట్, వాట్సాప్, కాలేజ్ లాగిన్ ద్వారా,.. ఈ మూడు విధాలుగా విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించారు.

TS Inter 1st Year 2026 Hall Tickets Release Date:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర హాల్ టికెట్లను ఫిబ్రవరి 18, 2026 తేదీన విడుదల చేశారు. విద్యార్థులు కాలేజ్ లాగిన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. కాలేజీ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను, కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు ఆ హాల్ టికెట్ ను పంపిస్తుంది. వాట్సాప్ ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

How to download Telangana Inter 1st year hall tickets:

ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి.

నేటి నుండి ఏపీ పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు | AP 10th Exams 2026 Started – Important Instructions To Students
  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్లోనికి (TGBIE WEBSITE) వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana intermediate 1st year 2026 hall tickets download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క Roll No/Hall Ticket Number, Date Of Birth ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. వెంటనే స్క్రీన్ పైన విద్యార్థి యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. ప్రింట్ అవుట్ తీసుకోండి.
  6. హాల్ టికెట్లు మీ పేరు, సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు, సమయం అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి

TS Inter 1st Year Hall Tickets Website

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల హాల్ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు?

ఈరోజు, అనగా ఫిబ్రవరి 18 2026 తేదీన హాల్ టికెట్లను విడుదల చేశారు.

RRB NTPC 2026 Admit Cards OUT | Railway NTPC Graduate 2026 Admit Cards Released – Freejobsintelugu

2. హాల్ టికెట్లను ఎన్ని విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు?.

కాలేజీ లాగిన్, వాట్సాప్, ఇంటర్ బోర్డు వెబ్సైట్.. ఈ మూడు విధాలుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం విద్యాశాఖ కల్పిస్తోంది.

3. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు?

RRB NTPC 2026 City Intimation | RRB NTPC 2026 Admit Cards Download | RRB NTPC 2026 Safe Score – Freejobsintelugu

ఫిబ్రవరి 25 నుండి మార్చి 17వ తేదీ వరకు మొదటి సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page