JEE Main 2026 Session 1 Results OUT Today : Cut Off Marks : Raw Score vs Percentile vs Rank Details

By: Sivakrishna Bandela

On: February 16, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

JEE Main 2026 Results:

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జనవరి నెలలో నిర్వహించిన JEE MAIN 2026 సెషన్ 1 పరీక్షల యొక్క ఫైనల్ కీ మరియు ఫలితాలను ఈ రోజు ( ఫిబ్రవరి 16) విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేయాల్సిన ఫలితాలను ఫిబ్రవరి 16వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి యొక్క ఫైనల్ కీ మరియు ఫలితాలను ఈరోజు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. Raw స్కోర్ చూసుకున్న తర్వాత వారికి వచ్చినటువంటి ర్యాంక్ ని అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారు వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, raw స్కోర్, Percentile, ర్యాంక్, కట్ ఆఫ్ మార్క్స్ వివరాలు చూడండి.

JEE Main 2026 ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం:

JEE main 2026 ఫలితాలను ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత ఫైనల్ కీ తో పాటు ఫైనల్ రిజల్ట్స్ కూడా విడుదల చేయనున్నారు. పరీక్ష రాసిన 13 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క వివరాలతో అధికారిక వెబ్సైట్ నుండి స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకుని, వారికి వచ్చిన ర్యాంక్ మరియు పర్సంటేలు చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

JEE main 2026 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చూసుకోండి.

JEE Mains 2026 Session 1 Final Key & Results OUT Today : Download Scorecard Step By Step
  1. ముందుగా JEE Mains అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లండి.
  2. వెబ్ సైట్ హోం పేజీలో “JEE Main 2026 Final Answer Key & Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, స్పెషల్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. స్కోర్ కార్డుని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
  6. ఆ ఫలితాలను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి.

JEE Main 2026 Results Website

JEE MAIN 2026 Cut Off Marks:

JEE Main 2026 ఫలితాలకు సంబంధించి అంచనా కట్ ఆఫ్ మార్కులు క్రింది విధంగా ఉండొచ్చు.

Category Cut Off Marks
Unreserved (UR)93.3045326
Gen-EWS81.4387917
OBC-NCL80.7456432
SC61.3526948
ST48.2456783

Note: పైన తెలిపిన కటాఫ్ మార్కులు గత సంవత్సరాల ఆధారంగా ప్రిపేర్ చేసిన అంచనా కట్ఆఫ్లు మాత్రమే. అధికారిక కటాఫ్ మార్కులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు విడుదల చేస్తారు

10 – 40 Marks In JEE Main 2026 Session Exam : Expected Percentile, Rank, JEE Advanced Status & College Options | JEE MAINS 2026 Results LIVE

Raw Score vs Percentile vs Rank Details:

Raw ScorePercentile Rank
300 το 200100 to 99.99981 to 3,804
190 to 10098.48033 to 99.59735,321 to 61,652
90 to 8192.76234 to 93.471279,299 to 1,02,421
80 to 7190.41098 to 91.07211,02,422 το 1,35,695
70 to 6187.06073 to 87.51221,35,696 to 1,83,105
60 to 5181.57582 to 82.016061,83,106 to 2,60,722
50 to 4173.08140 to 73.287802,60,723 to 3,80,928
40 to 3158.84001 to 58.151493,80,929 to 5,68,308
30 to 2140.34692 to 37.694525,68,309 to 8,44,157
20 to 1020.95045 to 13.495848,44,158 to 1,118,638
10 to 06.59980 to 0.843511,118,839 to 1,200,000

Note: పైన తెలిపిన వివరాలన్నీ కూడా గత సంవత్సరం ఆధారంగా చేసుకుని అంచనా వేసినటువంటి మార్కులు మరియు ర్యాంకు మాత్రమే. అధికారిక డేటా కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ ని సందర్శించండి.

JEE Main 2026 Updated ఫలితాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

JEE Main 2026 Result Session 1 LIVE : Scorecard Download Link, Release Date, Cut Off & Latest Updates

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page