Telangana TET 2026 exams Important Details:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 పరీక్షలను జనవరి 3 తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకి 2.37లక్షల మంది విద్యార్థులు అప్లికేషన్స్ పెట్టుకున్నట్లుగా విద్యాశాఖ అధికారులు తెలిపారు. రోజుకి రెండు షిఫ్ట్ ల వారీగా పరీక్షలు నిర్వహించినట్లు విద్యాశాఖ తెలిపింది. పరీక్షలు ఆన్లైన్లో కంప్యూటర్ లో నిర్వహించనున్నారు. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు, అలాగే పరీక్షకు వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్లాల్సిన ముఖ్యమైన సర్టిఫికెట్ల గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
తెలంగాణ టెట్ 2026 పరీక్షల ముఖ్య సమాచారం:
- పరీక్ష పేరు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026
- పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
- పరీక్షలు నిర్వహించే తేదీలు: జనవరి 3 నుండి జనవరి 31 వరకు
- మొత్తం ఎంతమంది అప్లై చేశారు : 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
- ఇప్పటికే హాల్టికెట్స్ విడుదల చేశారు. డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు:
- తెలంగాణ టెట్ పరీక్ష రాసా అభ్యర్థులు టెట్ పరీక్ష ఒక హాల్ టికెట్ ని ముందుగానే డౌన్లోడ్ చేసుకోవాలి.
- అభ్యర్థుల యొక్క పరీక్ష కేంద్రానికి 60 నిమిషాలు ముందుగానే చేరుకోవాలి.
- అభ్యర్థులకు కేటాయించిన షిఫ్ట్ టైమింగ్ అసలు మిస్ అవ్వకండి.
- ఒక్క నిమిషం ఆలస్యమైనా గేట్ లోపలికి అనుమతించరు. కావున మీ పరీక్ష కేంద్రానికి త్వరగా చేరుకోండి.
- మీ పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే సందర్శించండి. తద్వారా మీ పరీక్ష కేంద్రానికి పరీక్ష రోజు చేరుకోవడానికి మీకు ముందుగానే లొకేషన్ తెలుస్తుంది.
అవసరమైన డాక్యుమెంట్స్ లిస్ట్ :
తెలంగాణ టెట్ 2026 పరీక్షలకు హాజరయ్య అభ్యర్థులు కచ్చితంగా కింద తెలిపిన సర్టిఫికెట్లను వెంట తీసుకొని వెళ్ళాలి.
- తెలంగాణ టెట్ 2026 పరీక్షలు యొక్క హాల్ టికెట్ ప్రింటెడ్ కాఫీ
- ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ ( ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, కాలేజ్ ఐడి, లేదా ఇతర భారత ప్రభుత్వ గుర్తింపు ఐడి కార్డు) తీసుకువెళ్లాలి
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్
- బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్
పరీక్ష హాల్లోకి తీసుకువెళ్లకూడని వస్తువులు:
తెలంగాణ టట్టు పరీక్షకు హాజరు ఎవరు ఈ క్రింది వస్తువులను అస్సలు తీసుకువెళ్లకూడదు.
- మొబైల్ ఫోన్
- స్మార్ట్ వాచ్ లేదా డిజిటల్ వాచ్
- బ్లూటూత్ డివైసెస్
- క్యాలిక్యులేటర్
- పేపర్లు, నోట్స్ లేదా బ్యాగ్స్ తీసుకువెళ్ళకూడదు
టెట్ పరీక్ష రోజు అభ్యర్థులు చేయవలసిన పని:
- బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి.
- మీకు కేటాయించిన కంప్యూటర్ సిస్టం సీట్లోనే మీరు కూర్చోవాలి
- పరీక్ష జరుగుతున్న సమయంలో ఇతర అభ్యర్థులతో మాట్లాడకూడదు
- ప్రశ్నలు అర్థం కాకపోతే కంగారు పడకుండా పరీక్షను ప్రశాంతంగా రాయాలి.
టెట్ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను ప్రతిరోజు విజిట్ చేయండి.