TSRTC లో 800 కండక్టర్ల నియామకాలు : రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ప్రక్రియ ప్రారంభం

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TSRTC Conductors 2025:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో 800 కండక్టర్ల నియామకాల కొరకు త్వరలో అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేయమన్నారు. హైదరాబాదు రీజియన్ లో 600 కండక్టర్ పోస్టులు, వరంగల్ రీజియన్ లో 200 కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ప్రక్రియ ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పదో తరగతి అర్హత కలిగి నోటిఫికేషన్ లో ఇచ్చిన ఏజ్ లిమిట్ ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు సంబంధించి వచ్చిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

కండక్టర్ పోస్టుల ముఖ్యమైన హైలైట్స్:

Join WhatsApp group

  • హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజన్ లో ఉన్న యువతీ యువకులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
  • ఇవి తాత్కాలిక నియామకాలు మాత్రమే : కావున ₹17,969/- జీతం నెలకు చెల్లిస్తారు. ఓవర్ టైం చేసిన వారికి అదనపు జీతబత్యాలు కూడా ఉంటాయి.
  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలతో నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

ఔట్సోర్సింగ్ లోనే ఎందుకు భర్తీ చేస్తున్నారు:

గతంలో ప్రకటించినట్లుగా 3,038 రెగ్యులర్ ఆర్టీసీ ఉద్యోగాలలో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, ఆర్టీసీలో ఉద్యోగుల అవసరం ఉన్నందున రెగ్యులర్ నియామకాలు చేసే వరకు ఔట్సోర్సింగ్ విధానంలో త్వరితగతిన ఈ రిక్రూట్మెంట్ చేసి టెంపరరీగా కండక్టర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

RTC లో 1st క్లాస్ నుండి 10th క్లాస్ విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ ఇస్తున్నారు అప్లై చేయండి

ఖాళీల వివరాలు :

రీజియన్ పరిధి మొత్తం ఖాళీలు
హైదరాబాద్600
వరంగల్200
మొత్తం పోస్టులు800

అర్హతలు, జీతం, చేయవలసిన పనులు:

  • ఉండవలసిన అర్హతలు: పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన వారు అర్హులు
  • ఎంత జీతం ఉంటుంది: ఔట్సోర్సింగ్ కండక్టర్లుగా ఎంపికైన వారికి నెలకు ₹17,969/- జీతం చెల్లిస్తారు.
  • ఓవర్ టైం అలవెన్సెస్ :
  • ఒక్కో అదనపు గంటకు : ₹100/-
  • గంట దాటితే: ₹200/- చొప్పున చెల్లిస్తారు .
  • వారాంతపు సెలవులు : ప్రతి 6 మస్టర్లకు ఒక సెలవు ఉంటుంది
  • డ్యూటీ చేయవలసిన సమయం: రోజుకు 8 గంటలు డ్యూటీ చేయాలి. అవసరం అనుకుంటే అదనపు గంటల్లో కూడా పనిచేయాలి.

తెలంగాణ టెట్ హాల్ టికెట్స్,ఆన్సర్ కి, ఫైనల్ రిజల్ట్స్ డేట్ అప్ డేట్

నోటిఫికేషన్ ఎప్పటిలోగా వస్తుంది?:

తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ల అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. కానీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయం నుండి ఈ రిక్రూట్మెంట్ కు ఇప్పటికే అనుమతి వచ్చిందని సమాచారం. కొద్దిరోజుల్లోపు నోటిఫికేషన్ విలువడే అవకాశం ఉంది.

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

ఎంపిక విధానం:

తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్లను ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సెలక్షన్ చేస్తారు. అభ్యర్థులు స్థానికంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ డిపోలో గాని, ఆన్లైన్ ద్వారా గాని దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి.

అభ్యర్థులు ముందుగానే ఇవి సిద్ధం చేసుకోండి:

  • అభ్యర్థుల పండవలసిన విద్యార్హతలు సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, రెసిడెన్సి సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోండి.
  • నోటిఫికేషన్ విలువడైన వెంటనే అప్లికేషన్ పెట్టుకోవాలి కాబట్టి, ఈ అవకాశాన్ని వదులుకోకండి.
  • ఈ రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం https://tsrtc.telangana.gov.in వెబ్సైట్ గాని లేదా freejobsintelugu.com మా వెబ్సైట్ గాని ప్రతిరోజు సందర్శించండి.

దొంగల కండక్టర్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి అనుమతి ఇచ్చినందున, నిరుద్యోగ యువతీ యువకులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అభ్యర్థులు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కూడా పొందవచ్చు.

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page