ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం: ఫలితాలు విడుదల చేసే తేదీ : పూర్తి వివరాలు చూడండి

By: Sivakrishna Bandela

On: May 22, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 10th Supplementary Exams 2025:

ఆంధ్రప్రదేశ్లో మే 19వ తేదీ నుండి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు మే 28వ తేదీ వరకు జరగనున్నాయి. నిన్న జరిగిన సప్లిమెంటరీ పరీక్షకు 35,686 మంది విద్యార్థులకు గాను 22,238 మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 765 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 543 పరీక్ష కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు. అయితే ఈ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలను జూన్ 5వ తేదీ నాటికి విడుదల చేయనున్నట్లు సమాచారం. మే 28న పరీక్షలు పూర్తయిన వెంటనే పరీక్ష పత్రాలు మూల్యాంకనం ప్రారంభిస్తారు. తర్వాత ఫలితాలు వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచి, విద్యార్థులు చెక్ చేసుకునే విధంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏపీ పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

10th సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ?:

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 28వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఫలితాలను జూన్ 5వ తేదీ నాటికి విడుదల చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జూన్ నెల నుంచి ఇంటర్మీడియట్ కళాశాల క్లాసులు ప్రారంభమవుతున్నందున , పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇంటర్లో జాయిన్ అవ్వడానికి ఆలస్యం కాకుండా ఫలితాలు త్వరగా విడుదల చేయాలని ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ భావిస్తుంది.

Join Whats App Group

AP EAPCET 2026 Counselling Notification, Dates, Process, Certificates, Seat Allotment Details

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేశాక అధికారికి వెబ్సైట్లో ఈ క్రింది విధంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి.

  1. ఏపీ టెన్త్ బోర్డు వెబ్సైట్ (https://www.bse.ap.gov.in/) ఓపెన్ చేయండి
  2. హోం పేజీలో ” AP 10th supplementary results 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.

ఏపీ పదవ తరగతి ఫలితాలను త్వరలో విడుదల చేస్తారు పైన చెప్పిన విధంగా మీ యొక్క ఫలితం రిజల్ట్స్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోండి.

AP 10th Board Website

TG TET 2026 Answer Key Release Date | TS TET 2026 Exam Answer Key

FAQ’s:

1. ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ముగుస్తాయి?

మే 28వ తేదీ నాటికి అన్ని సప్లిమెంటరీ పరీక్షలను పూర్తి చేయనున్నారు

2. ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?

Re NEET 2026 Official Answer Key & OMR Sheet PDF Today? LIVE: NTA NEET UG Key Release Date, Download Link

జూన్ 5వ తేదీ నాటికి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page