ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల – పూర్తి సమాచారం ఇక్కడ చూడండి

By: Sivakrishna Bandela

On: April 24, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP constable Mains exam dates 2025:

ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు అధికారికంగా కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలను విడుదల చేయడం జరిగింది. (SCT Police Constable Civil & APSP) ఉద్యోగుల బత్తికి సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల చేశారు. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మరియు ఫిజికల్ ఈవెంట్స్ లో అర్హత పొందినటువంటి అభ్యర్థులు ఈ మెయిన్స్ రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

మెయిన్స్ రాత పరీక్ష తేదీలు ఇవే:

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలను జూన్ 1st తేదీ 2025న అధికారికంగా నిర్వహించబోతున్నారు. ఈ మెయిన్స్ రాత పరీక్షకు ఒకే ఒక పేపర్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష నిర్వహించే సెంటర్స్:

పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షను ఆంధ్రప్రదేశ్ లోని ఐదు ప్రధాన సెంటర్స్ లో నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, గుంటూరు, తిరుపతిలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు.

Join Whats App Group

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

మెయిన్స్ కు అర్హత పొందిన అభ్యర్థుల సంఖ్య ఎంత?:

ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షను 4,59,182 మంది రాత పరీక్ష రాయడం జరిగింది. ఈ ప్రిలిమ్స్ పరీక్షను 2023 జనవరి నెలలో నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి ఫిజికల్ ఈవెంట్స్ కు అర్హత పొందినటువంటి అభ్యర్థులు 95,208 మంది. అయితే ఫిజికల్ టెస్టుల నుంచి మెయిన్స్ పరీక్షలకు అర్హత పొందినటువంటి వారు 38,910 మంది. మెయిన్స్ కు అర్హత పొందినటువంటి వారు జూన్ 1వ తేదీన హాజరుకావలెను.

హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?:

మెయిన్స్ రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థుల కోసం పరీక్షకు పది రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో (APSLPRB Website ) హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఆక్టివేట్ చేయడం జరుగుతుంది.

రాత పరీక్ష విధానం?:

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలో అభ్యర్థులకు ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ జీకే మరియు జీఎస్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. టెన్త్ స్టాండర్డ్ లెవెల్ లోనే ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు నోటిఫికేషన్ లో తెలిపినటువంటి సిలబస్ ఆధారంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలకు ఎటువంటి నెగటివ్ మార్క్స్ లేవు.

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

Exam Dates Official Notice

AP కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష డేట్స్: Click Here

Official Website Link

ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇతర అన్ని పరీక్షల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page